యూజర్లకు షాకిచ్చిన షియోమి, ఇండియా నుంచి అవుట్

షియోమి సంచలన నిర్ణయం, ఎంఐ నోట్ 2, ప్యూచరిస్టిక్‌ ఎం మాక్స్‌ ఫోన్లకు ఇండియాలో నో ఎంట్రీ

By Hazarath
|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి సంచలన నిర్ణయం తీసుకుంది. తన తరువాతి తరం ఫోన్లను ఇండియాలో విడుదల చేయనంటూ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నుంచి తాజాగా రానున్న ఎంఐ నోట్ 2, ప్యూచరిస్టిక్‌ ఎం మాక్స్‌ ఫోన్లను భారత్‌లో విడుదల చేసే ప్రసక్తే లేదనిచెప్పింది. దీంతో పాటు నెల రోజుల కిందట విడుదలైన ఎంఐ 5ఎస్‌ అమ్మకాలు కూడా భారత్ నిలిపివేస్తామని ప్రకటించింది.

దీపావళికి సిద్ధంగా ఉన్న బెస్ట్ డేటా ఆఫర్లు

 ఎంఐ నోట్‌-2

ఎంఐ నోట్‌-2

హైఎండ్‌ టెక్నాలజీ, టాప్‌ ఫీచర్లతో కూడిన ఎంఐ నోట్‌-2ను, ప్యూచరిస్టిక్‌ ఎంఐ మాక్స్‌ మోడళ్లను షియోమి బుధవారం చైనాలో విడుదల చేసిన విషయం విదితమే.

ఇండియాలో అంతగా ఆదరణ

ఇండియాలో అంతగా ఆదరణ

అయితే, ఎక్కువమొత్తంలో ధర ఉండే తన ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు భారత్‌లో మార్కెట్‌ చాలా స్పల్పంగా ఉంది. ఈ ఫోన్లకు ఇండియాలో అంతగా ఆదరణ లభించడం లేదు.

భారత్‌లో ఏడాదికి ఒకటే హైఎండ్‌ ఫోన్‌

భారత్‌లో ఏడాదికి ఒకటే హైఎండ్‌ ఫోన్‌

అందువల్ల భారత్‌లో ఏడాదికి ఒకటే హైఎండ్‌ ఫోన్‌ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కొత్త మోడళ్లను ఇక్కడ అమ్మడం లేదని కంపెనీ తాజాగా స్పష్టత ఇచ్చింది.

ఎంఐ-5 ఫోన్‌కు భారత్‌లో..
 

ఎంఐ-5 ఫోన్‌కు భారత్‌లో..

నెల రోజుల కిందట హైఎండ్‌ టెక్నాలజీతో వచ్చిన ఎంఐ-5 ఫోన్‌కు భారత్‌లో పెద్దగా ఆదరణ లభించలేదు. అంతేకాకుండా షియోమి భారత్‌ కన్నా తన ప్రధాన మార్కెట్‌ అయిన చైనాపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.

కొత్త ఫోన్లను భారత్‌కు పంపడం లేదని

కొత్త ఫోన్లను భారత్‌కు పంపడం లేదని

రెండేళ్లుగా భారత్‌ మార్కెట్‌లో ఉన్నా ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు తమకు పెద్దగా మార్కెట్‌ లేదని, అంతేకాకుండా ఏడాదికి ఒక హైఎండ్‌ ఫోన్‌ను మాత్రమే విడుదల చేయాలన్న నిర్ణయం కారణంగా తమ కొత్త ఫోన్లను భారత్‌కు పంపడం లేదని షియోమి చైనా వ్యవహారాల వైస్‌ ప్రెసిడెంట్‌ హ్యుగో బర్రా వెల్లడించారు.

ఎంఐ నోట్‌-2 ధర

ఎంఐ నోట్‌-2 ధర

5.7 అంగుళాల 3డీ టచ్ డిస్ ప్లే.. 23 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఎంఐ నోట్‌-2 ధర చైనా మార్కెట్‌ ప్రకారం సుమారుగా రూ. 27,700 నుంచి రూ. 29,700 మధ్య ఉండే అవకాశముంది.

షియోమిని అభిమానించే భారతీయులకు

షియోమిని అభిమానించే భారతీయులకు

అయితే షియోమి తీసుకున్న ఈ తాజా నిర్ణయం షియోమిని అభిమానించే భారతీయులకు నిజంగా నిరాశ కలిగించే అంశమే..

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi Note 2, Mi MIX Smartphones Aren't Coming to India in the Near Future read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X