కూల్‌ప్యాడ్ కూల్ 1 రూ. 1000 తగ్గింది

Written By:

గతేడాది కూల్‌ప్యాడ్ కూల్ 1 లాంచ్ అయిన సంగతి తెలిసిందే. రూ. 13,999 ధర వద్ద దీన్నిఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 1000 తగ్గింది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని విక్రయిస్తోంది. గోల్డ్ సిల్వర్ కలర్స్‌లో లభ్యమవుతున్న ఈ ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

ఇక జీమెయిల్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

కూల్ 1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ కెమెరా 2.0 టెక్నాలజీ బ్లాక్ వైట్ ఇంకా కలర్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ఈ మూడు సెన్సార్లు హైక్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తాయి.

బలోపేతమైన కెమెరా

కూల్ 1 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ కెమెరా 2.0 టెక్నాలజీ పోన్ సెకండరీ కెమెరా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కూల్ 1 స్మార్ట్‌ఫోన్ లో పొందుపరిచిన కెమెరా వ్యవస్థ ఇమేజ్ క్లారిటీ ఇంకా బ్రైట్నెస్‌ను అదనంగా 20 శాతం మెరుగుపరుస్తుంది. లో లైట్ కండీషన్‌లలోనూ ఈ ఫోన్ కెమెరా అత్యుత్తమంగా స్పందిస్తుంది.

 

 

కెమెరా ప్రత్యేతలు

ముఖ్యంగా ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు ఆకట్టుకునే పనితీరును కనబరుస్తాయి. f/2.0 అపెర్చుర్, పీడీఏఎఫ్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 6 పిక్సల్స్ లెన్స్ ఇంకా కొన్ని ఫిల్టర్స్‌ ఈ కెమెరాలలో పొందుపరిచారు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్పీతో పాటు వీడియో కాలింగ్ ను ఆస్వాదించవచ్చు..

ఫింగర్ ప్రింట్ సెన్సార్

కూల్ 1 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఈ సెన్సార్ 0.15 సెకన్ల వ్యవధిలోనే స్పందిస్తుంది. కూల్ 1 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.

ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ వేరియంట్స్

ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి). ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి కూల్ 1 స్మార్ట్‌ఫోన్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం.

4060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

కూల్ 1 స్మార్ట్‌ఫోన్.. యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌తో వస్తోంది. 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్ స్టాండ్ పై, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ వంటి ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు డివైస్ లో నిక్షిప్తం చేసారు. కూల్ 1 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 4060 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Cool 1 with dual-camera setup gets the price cut of Rs 1000 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot