4జిబి ర్యామ్‌తో కూల్ ప్యాడ్ నోట్ 5 దిగింది

Written By:

చైనా దిగ్గజం కూల్ ప్యాడ్ తన తరువాతి ఫోన్ కూల్ ప్యాడ్ నోట్5ని లాంచ్ చేసింది. దీనికి కూల్ ప్యాడ్ మేడ్ ఇన్ ఇండియా అనే పేరు కూడా పెట్టింది. అక్టోబర్ 20 నుంచి అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ గా లభ్యమవుతుంది. దీంతో పాటు ఓపెన్ సేల్ లో కూడా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది.దీని ధర రూ. 10,999. ఫీచర్స్ కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి. 4010mAh బ్యాటరీతో వచ్చిన ఈఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ఇప్పుడు ఆపిల్ వంతు..పేలుతున్న ఐఫోన్ 7 ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

మెటల్ బాడీతో వచ్చిన ఈ ఫోన్ 5.5 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేని కలిగి ఉంది. 1080x1920 pixels రిజల్యూషన్ దీని సొంతం.

ప్రాసెసర్

ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 617 SoC మీద రన్ అవుతుంది. Adreno 405 GPU తో పాటు కర్వడ్ గ్లాస్ ని పొందుపరిచారు. Cool UI 8.0, based on Android 6.0 Marshmallow.

ర్యామ్

4జీబి ర్యామ్ తో పాటు 32 జిబి ఇంటర్నల్ మెమొరీని పొందుపరిచారు. దీన్ని మైక్రో ఎస్ డీ ద్వారా 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

13 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు డ్యూయెల్ ఎల్ ఈడి ప్లాష్ లైట్ ఉంటుంది. 8 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరాను ప్రంట్ భాగంలో పొందుపరిచారు. ఎల్ ఈడీ ప్లాష్ లైట్ మాడ్యూల్ తో పాటు smart beautification feature కూడా కొత్తగా చేర్చారు.

సపోర్ట్

అన్ని 4జీ సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే 4జీ వోల్ట్ పోన్లకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే 4010mAhతో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.అయితే ఇందులో మల్టీ స్క్రీన్ ఫీచర్ ఉందని చెబుతున్నారు. అయితే దీనిమీద ఎటువంటి క్లారిటీ లేదు.

అదనపు ఫీచర్లు

హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ , ఒకదానిలో మైక్రో ఎస్ డి కార్డు గాని సిమ్ కార్డ్ గాని వాడుకునే సౌలభ్యాన్ని పొందుపరిచారు. 0.5 సెకండ్లలో అన్ లాక్ చేసుకునే విధంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Note 5 launched in India, priced at Rs 10,999: Specifications, features read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot