ఇప్పుడు ఆపిల్ వంతు..పేలుతున్న ఐఫోన్ 7 ఫోన్లు

Written By:

కొరియా దిగ్గజం శాంసంగ్ కు ఈ మధ్య కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది శాంసంగ్ గెలాక్సీ నోట్ పేళుళ్ల అంశమే.. ఫోన్ లాంచ్ చేయడమే ఆలస్యం వరుసగా ఫోన్లు పేలిపోతున్నాయని కంప్లయిట్లు రావడం శాంసంగ్ వాటన్నింటిని రీకాల్ చేస్తున్నామని చెప్పడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ సమయంలో ఆపిల్ ఐ ఫోన్ 7 రంగ ప్రవేశం చేయడంతో ఆపిల్ అమ్మకాలు మార్కెట్లో దుమ్మురేపాయి. అయితే ఇప్పుడు ఆపిల్ ను కూడా శాంసంగ్ ను వేధించిన సమస్యనే వేధిస్తోంది. ఐఫోన్ 7 పేలిపోతోందనే వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

శాంసంగ్ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐపోన్ 7 పేలిపోయిందనే వార్త

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోయాయనే వార్తతో ఆపిల్ లోలోపల ఖుషీ అయి ఉంటుంది. ఆ ఫోన్ రాక ఆలస్యంతో తమ అమ్మకాలు భారీగా పెంచుకోవచ్చనే ధీమాలో ఉన్న ఆపిల్ కు ఐపోన్ 7 పేలిపోయిందనే వార్తతో ఇప్పుడు దిమ్మతిరిగింది.

ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ వేరియంట్

ఐఫోన్ 7 పేలిపోయిందంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఫ్లాట్ పాం రెడ్డిట్ లో kroopthesnoop అనే యూజర్ పోస్ట్ చేశారు.ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ వేరియంట్ పేలిపోయిందంటూ కొన్ని ఫోటోలను ఉంచాడు.

రవాణా సమయంలో పేలిపోయిందని

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ సమస్య వల్ల పేలిపోతే ఐఫోన్ 7 ప్లస్ రవాణా సమయంలో పేలిపోయిందని తెలిపాడు. అతను ఐఫోన్ బాక్స్ రిసీవ్ చేసుకుని అందులో ఫోన్ ను తెరిచి చూడగా అది ఇలా పేలిపోయిందని తెలిపాడు.

ఫ్యాక్టరీ డెలివరీ సమయంలోనే

ఫ్యాక్టరీ డెలివరీ సమయంలోనే ఇది పేలిపోయి ఉండవచ్చని ఆ సమయంలో దాన్ని అలాగే ప్యాక్ చేసి వాళ్లు పంపి ఉండవచ్చని ఆ బాక్స్ ఇప్పుడు తనకు వచ్చి ఉంటుందని యూజర్ తెలిపారు.

ఆపిల్ ఈ విషయంపై

అయితే ఆపిల్ ఈ విషయంపై ఇంకా సమాచారం అందినట్లు లేదు. ఈ విషయాన్ని ఆపిల్ కు చేరవేసి ఫోన్ రీప్లేస్ మెంట్ కోరాలనుకుంటున్నట్లు యూజర్ తెలిపారు. అయితే దీన్ని ఇన్విస్టిగేషన్ చేసేందుకు చాలా కంపెనీలకు ఇదొక అవకాశంలా మారుతుందేమో మరి.

ఐపోన్7 ఎందుకు పేలిందనే విషయం

ఐపోన్7 ఎందుకు పేలిందనే విషయం గురించి ఆరాతీయడానికి కొన్ని కంపెనీలు ఇప్పడు ఇన్విస్టిగేషన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

దిగ్గజ కంపెనీల ఫోన్లే ఇలా

దిగ్గజ కంపెనీల ఫోన్లే ఇలా పేలిపోతుంటే ఇక చిన్న కంపెనీలు సంగతి ఎలా ఉంటుందో మరి. ముందు ముందు ఇంకా ఏ కంపెనీలు ఫోన్లు పేళుళ్లతో వస్తాయో చూడాలి.

ఐ ఫోన్లు పేలిపోతున్నాయ్

బికేర్ పుల్..ఐ ఫోన్లు పేలిపోతున్నాయ్.. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

శాంసంగ్ ఆ ఫోన్లను రీకాల్ చేస్తోంది

షాక్.. శాంసంగ్ ఆ ఫోన్లను రీకాల్ చేస్తోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
After Samsung Galaxy Note 7, now an Apple iPhone 7 explodes read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting