అక్కడ ఐఫోన్ రేట్లు ఎంత తక్కువంటే..

Written By:

ఐఫోన్ ఈ పేరంటేనే చెప్పలేని క్రేజ్. ప్రతి ఒక్కరూ తమ చేతిలో ఐఫోన్ ఉండాలని తహతహలాడుతుంటారు. అయితే దాని ధరను చూసి చాలామంది కొనలేక నిరుత్సాహపడుతుంటారు. అయితే అంగోలా దేశంలో మీరు ఐఫోన్ కొంటే దాని ధర వన్ ప్లస్ 3టీ కన్నా తక్కువగా ఉంటుందట.. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ లినియో జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

విండోస్ 10 ఉచితంగా పొందడమెలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లినియో సంస్థ

14 రకాల గ్యాడ్జెట్ల ధరలపై సర్వే నిర్వహించిన లినియో సంస్థ.. తాజాగా ‘టెక్నాలజీ ప్రైస్‌ ఇండెక్స్‌' పేరుతో మైబైల్స్ పై  ఓ రిపోర్టును విడుదల చేసింది.

72 దేశాలలో

మొత్తం 72 దేశాలలో ఒక్కో దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలు పెట్టిన ధరలను క్రోడీకరించి రిపోర్ట్‌ను తయారు చేసింది.

అంగోలాలో ఐఫోన్‌ సగటు ధర

ఆ నివేదిక ప్రకారం అంగోలాలో ఐఫోన్‌ సగటు ధర 401.4 డాలర్లు(సుమారు రూ. 27,290) మాత్రమేనట. అదే భారత్‌లో 505.25 డాలర్లు(రూ.34,350) అమెరికాలో 625.88 డాలర్లు(రూ.43,230)గా ఉంది.

తొలి ఐదు స్థానాల్లో

ఆంగోలా తర్వాత జపాన్ 413.58 డాలర్లు, చైనా 470.74 డాలర్లు, ఫిన్లాండ్ 475.94 డాలర్లు, యూఏఈ 498.25 డాలర్లతో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

వెనెజులా దేశంలో ..

ఇక ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వెనెజులా దేశంలో ఐఫోన్ రేట్లు వింటే దిమ్మతిరగాల్సిందే. అక్కడ ఐఫోన్ల సగటు ధర 97,813.82 డాలర్లు(రూ.66 లక్షలకు పైనే) ఉన్నట్లు లినియో వెల్లడించింది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Did You Know The Cheapest iPhone In The World Is Sold In Angola At Just Rs 27,300 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot