విండోస్ 10 ఉచితంగా పొందడమెలా..?

Written By:

మైక్రోసాప్ట్ విండోస్ 10 రిలీజ్ చేయగానే దాన్ని అందరూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటూ గడువు తేదీ ఇచ్చింది. ఆ తేదీ గతేడాది జూలై 29తోనే అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా విండోస్ 10ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కొంతమొత్తం పే చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి వర్రీ కానవసరం లేదు. విండోస్ 10ని ఇప్పుడు కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు విండోస్ 10ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విండోస్ 7 వాడుతున్నారా..ఇకపై మీకు అన్నీ కష్టాలే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మైక్రోసాఫ్ట్ విండోస్ పేజిని ఓపెన్ చేస్తే అందులో మీకు డౌన్‌లోడ్ ఆప్సన్ కనిపిస్తుంది. లింక్ కోసం క్లిక్ చేయండి

స్టెప్ 2

అక్కడ కనిపించే డౌన్‌లోడ్ ఆప్సన్ మీద క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ పూర్తి అయినవెంటనే దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు కండీషన్స్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది.

స్టెప్ 3

అది క్లిక్ చేయగానే మీకు అప్‌గ్రేడ్ పీసీ నౌ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే విండోస్ 10 డౌన్ లోడ్ అవుతుంది. అయితే ఇది కొంత సమయం తీసుకుంటుంది.

స్టెప్ 4

డౌన్‌లోడ్ సమయంలో మీకు పర్సంటేజ్ కనిపిస్తుంది. అది పూర్తిగా డౌన్‌లోడ్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. అయిపోయిన తరువాత దాన్ని ఇన్ స్టాల్ చేసే సమయంలో మళ్లీ లైసెన్స్ టర్మ్ కండీషన్స్ అడుగుతుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి.

స్టెప్ 5

అది పూర్తిగా ఇన్ స్టాల్ అయిన తరువాత మీ సిస్టంను ఓ సారి రీస్టార్ట్ చేయండి. అప్పుడు మీకు విండోస్ 10కు ఫీచర్స్ కనిపిస్తాయి. మీరు విండోస్ 10 అప్ గ్రేడ్ కావడానికి దాదాపు 1 గంటకు పైగానే సమయం తీసుకుంటుంది. అది ఇంటర్నెట్ చాలా ఫాస్ట్ గా ఉంటే మీ పని తొందరగా అవుతుంది. లేకుంటే మరింత సమయం తీసుకుంటుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Upgrade to Windows 10 for Free, Even Now read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting