గెలాక్సీ ఎస్4 ఫోటో ఇదేనా..?

Posted By: Super

గెలాక్సీ ఎస్4 ఫోటో ఇదేనా..?

 

సామ్‌సంగ్  గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌కు  తరువాతి వర్షన్‌గా రాబోతున్న గెలాక్సీ ఎస్4కి సంబంధించిన కీలక ఫోటోగ్రాఫ్  టెక్నాలజీ వెబ్‌సైట్ ‘శ్యామ్ మొబైల్’కు అందింది.  అయితే, ఈ ఫోటోకు సంబంధించి వాస్తవాలు వెల్లడి కావల్సి ఉంది. సదరు ఫోటోగ్రాఫ్‌లో  కనిపిస్తున్న డిజైన్ గెలాక్సీ ఎస్3 అలానే గెలాక్సీ ప్రీమియర్‌లను పోలి ఉంది. డివైజ్ ముందు భాగంలో హోమ్ బటన్ కనిపించటం లేదు. పల్చటి తత్వం ఇంకా పెద్దదైన డిస్‌ప్లే విశ్లేషకులు అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది.

అనధికారికంగా సేకరించిన వివరాల మేరకు  గెలాక్సీ ఎస్4 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి:

5 అంగుళలా స్ర్కీన్,

1080 పిక్సల్ ఆమోల్డ్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్-కోర్ ఎక్సినోస్ ఎస్440 చిప్ (28ఎన్ఎమ్ హై-కె మెటల్ గేట్ టెక్నాలజీ),

13 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా.

తొలి ఆపిల్ ఐఫోన్ డిజైన్ (1983)!

ఈ మోడళ్లు యమా హాట్ (30 పిచ్చెక్కించే ఫోటోలు)

2013కుగాను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4’పై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా విడుదలకాబోతున్న ఈ హ్యాండ్‌సెట్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ హాటెస్ట్ గాడ్జెట్‌కు సంబంధించి తాజాగా బహిర్గతమైన ఓ వీడియో గెలాక్సీ ఎస్ (జీటీ-ఐ9500) ఫీచర్లను ఈ క్రింది విధంగా పేర్కొంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న గెలాక్సీ ఎస్4 లేజర్ కీబోర్డ్ ఫీచర్‌ను కలిగి ఉండటం విశేషం

రోజిట్ కిడ్ వెలవరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్4 స్పిషికేషన్‌లు:

అల్ట్రా సిమ్, లైటెస్ట్,

1080 పిక్సల్ గ్రాండ్ ఆమెల్డ్ డిస్‌ప్లే,

13 మెగా పిక్సల్ కెమెరా,

2గిగాహెట్జ్ 4 క్వాడ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 5.0 కీ లైమ్ పీ ఆపరేటింగ్ సిస్టం,

లేజర్ కీబోర్డ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot