దడ పుట్టిస్తున్న గెలాక్సీ ఎస్8, 2 నెలలు ముందుగానే..

Written By:

దక్షిణ కొరియా ఎలక్ట్రానికి దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8తో త్వరలో మార్కెట్ ని షేక్ చేయనుంది. మీడియాకి అందిన నివేదికల ప్రకారం ఈ ఫోన్ అనుకున్న దానికంటే ముందుగానే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని శాంసంగ్ అనుకుంటోంది. గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల మరకలను పోగొట్టుకుని వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకుగానూ ఫిబ్రవరి 2017 లోను దీన్ని లాంచ్ చేయనుంది. ముందు అనుకున్నట్లుగా ఏప్రిల్ లో ఈఫోన్ వస్తుందని అంచనా వేశారు. అయితే రెండు నెలలు ముందుగానే మార్కెట్లో సందడి చేయనుంది.

భారీ డిస్కౌంట్‌ ధరల్లో ల్యాపీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4 కె స్క్రీన్

రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 1440 x 2560 ఎంపీ రిజల్యూషన్ తో 4 కె స్క్రీన్ తో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్, బ్యాటరీ

ర్యామ్ విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ ఎక్స్ పాండబుల్ మొమొరీ ఉంటుందని సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే 4,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. ఎంత రఫ్ గా వాడినా 24 గంటలు బ్యాటరీ లైఫ్ ఉండే విధంగా దీన్ని రూపొందించారు.

కెమెరా

కెమెరా అయితే దుమ్మురేపనుంది. మునుపెన్నడూ తీసుకురానంత స్థాయిలో 30 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. దీంతో పాటు డ్యూయెల్ లెన్స్ కెమెరాతో ఈ ఫోన్ రానుంది.

ధర

ఇక ధర విషయానికి వస్తే ఎస్ 7 ఎస్ 7 ఎడ్జ్ రేంజ్ లోనే ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు వేరియంట్లలో వస్తున్న గెలాక్సీ ఎస్ 8 64 జీబీ రూ .55,000, 128 జీబీ రూ. 60,000 ఉండొచ్చని అంచనా.

బ్యాటరీ లో మరిన్ని జాగ్రత్తలతో పాటు

గెలాక్సీ నోట్ 7 ద్వారా కంపెనీ వేల కోట్ల నష్టాలను మూటగట్టుకున్న నేపథ్యంలో ఈ ఫోన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బ్యాటరీ లో మరిన్ని జాగ్రత్తలతో పాటు, ఎక్సినాస్ 8895 ప్రాసెసర్ విత్ మాలి-జీ 71 జీపీయుతో గెలాక్స్ ఎస్ 7 కంటే 1.8 రెట్ల అధిక సామర్ధ్యంతో రానుందని తెలుస్తోంది.

ఆడియో జాక్

అయితే ఎస్ 8 లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ను తొలగించినట్టు తెలుస్తోంది. అలాగే వైర్ లెస్ ఎయిర్ బడ్స్ ను కూడా లాంచ్ చేయనుంది. సామ్సంగ్ తన అప్ కమింగ్ గెలాక్సీ ఎస్ 8 ద్వారా తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Expected launch, key features of Samsung Galaxy S8 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting