ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

Written By:

గత అయిదు నెలల నుంచి దేశంలో సంచలనం రేపిన ఫోన్లు ఏవైనా ఉన్నాయంటే అవి ఫ్రీడం పోన్లు మాత్రమే. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ సంచలన ప్రకటన చేసినప్పటి నుంచి ఆ ఫోన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ అప్పటి నుంచి మొదలైన విషయం విదితమే. అయితే అవి ఎట్టకేలకు డెలివరీ అయ్యాయని కంపెనీ సీఈఓ చెబుతున్నారు. మరి ఎక్కడెక్కడ డెలవరి అయ్యాయో మీరే చూడండి.

మోడీ రూ.50 వేల కోట్లు ఇస్తే..రూ.251 ఫోన్ల కొత్త రాగం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివిధ రాష్ట్రాల్లో స్వల్ప సంఖ్యలో

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

ఫ్రీడం 250 స్మార్ట్ ఫోన్ల డెలివరీలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప సంఖ్యలో ఫోన్ల బట్వాడా మొదలు పెట్టినట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. సుమారు అయిదువేల ఫోన్లను అందిస్తున్నట్టు వెల్లడించింది.

అక్కడక్కడా..

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

హర్యానాలో 390 ఫోన్లు, పశ్చిమ బెంగాల్లో 540 ఫోన్లు, హిమాచల్ ప్రదేశ్, 484, 605 ఫోన్లు బీహార్లో, ఉత్తరాఖండ్లో 221 ఫోన్లను మొదటి విడతగా పంపిణీ మొదలుపెట్టనట్టు రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ పీటీఐకి వెల్లడించారు.

మొదటి విడతలో అయిదువేల స్మార్ట్ ఫోన్ల డెలివరీకి

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

మొదటి విడతలో అయిదువేల స్మార్ట్ ఫోన్ల డెలివరీకి కట్టుబడి ఉన్నామని గోయల్ తెలిపారు. సుమారు 2,240 యూనిట్లను కొరియర్ సర్వీసు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా తమ ఖాతాదారులకు అందించనున్నట్టు ఆయన తెలిపారు.

ఢిల్లీలో వినియోగదారులకోసం 223 ఫోన్లు

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

ఢిల్లీలో వినియోగదారులకోసం 223 ఫోన్లు, పంజాబ్లో 364 , జమ్ము కాశ్మీర్ 108, మహారాష్ట్ర 521, మధ్యప్రదేశ్లో 194, జార్ఖండ్లో 225, రాజస్థాన్లో 365 స్మార్ట్ ఫోన్లకు డెలివరీ చేస్తున్నామన్నారు.అలాగే ఉత్తర ప్రదేశ్ లో సోమవారం నోయిడా, ఘజియాబాద్, మీరట్ లలో పంపిణీ ప్రారంభిస్తామన్నారు.

మిగతా రెండు లక్షల ఫోన్ల పంపిణీకి

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

అనంతరం మిగతా రెండు లక్షల ఫోన్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన భాగాలు ఇప్పటికే ఫ్యాక్టరీకి చేరుకున్నాయని తెలిపారు. ఈ క్రేజీ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ కోసం, కొనుగోలుదారులు డెలివరీ ఛార్జ్ గా రూ 40 రూ.అదనంగా చెల్లించాల్సి ఉందట.

దాని పనితీరు

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

మరి దాని పనితీరు ఎలా ఉందనేది వాడిన కష్టమర్ రివ్యూలు చూడాల్సిందే.మరొక్క రోజు ఆగితే అది కూడా తెలిసిపోతుంది.

ఫస్ట్ లుక్

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

ఫస్ట్ లుక్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write First 2240 units of 'Freedom 251' out for delivery: Ringing Bells
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot