మోడీ రూ.50 వేల కోట్లు ఇస్తే..రూ.251 ఫోన్ల కొత్త రాగం

Written By:

రూ. 251 సంచలనాత్మక ఫోన్ అందిస్తామంటూ ప్రకటనలతో హోరెత్తించిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఇప్పుడు కొత్త మెలికి పెట్టింది, కష్టమర్లకు మేము ఈ ఫోన్లు అందించాలంటే మీకు ప్రధాని నరేంద్ర మోడీ 50 వేల కోట్లు ఇవ్వాలని రింగింగ్ బెల్స్ సీఈఓ మోహిత్ గోయెల్ చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఈ ఫోన్లు రేపు నుంచి ఇస్తామని చెబుతున్నారు. డిజిటల్ ఇండియా కల నెరవేరాలంటే మాకు రూ. 50 వేల కోట్లు కావాలని చెబుతున్నారు. ఆయన మాటలేంటో మీరే చూడండి.

ఇండియాలో ఉద్యోగానికి బెస్ట్ కంపెనీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

నరేంద్ర మోదీ సర్కారు డిజిటల్ ఇండియా ఫండ్స్ కు కేటాయించిన నిధుల నుంచి రూ. 50 వేల కోట్లను తమ సంస్థకు ఇస్తే, దేశంలోని 75 కోట్ల మందికి రూ. 251 కే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని రింగింగ్ బెల్స్ సీఈఓ మోహిత్ గోయల్ వ్యాఖ్యానించారు.

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

ఫ్రీడమ్ 251 పేరిట సంచలనాత్మక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసి, ఆపై విమర్శల పాలైన రింగింగ్ బెల్స్ సంస్థ ఇప్పటికే స్మార్ట్ ఫోన్ డెలివరీలను మూడు సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

ఇక తాజా డెలివరీ తేదీ జులై 8. అయితే అది సమీపిస్తున్న నేపథ్యంలో మోహిత్ మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ల డెలివరీని రేపు ప్రారంభించనున్నామని, డెలివరీ చార్జీలుగా రూ. 40 చెల్లించాల్సి వుంటుందని తెలిపారు.

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

తొలి విడతలో 5 వేల యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనున్నామని, ఆపై వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను పరిశీలించి ముందడుగు వేస్తామని తెలిపారు. కస్టమర్ల సౌకర్యార్థం దేశవ్యాప్తంగా 500 కస్టమర్ కేర్ సెంటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు.

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

ఒక్కో ఫోన్ పై రూ. 180 నుంచి రూ. 270 వరకూ నష్టాన్ని భరిస్తున్నామని మోహిత్ తెలిపారు. కేవలం ఫ్రీడమ్ 251 యూజర్ల కోసం రూ. 1 నుంచి రూ. 3 మధ్య 100 కు పైగా కొత్త యాప్స్ సిద్ధం చేశామని, వాటి ద్వారా తమకు నష్టపోయే ఆదాయం వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

కాగా, ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 4 అంగుళాల డిస్ ప్లే, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమోరీ, 8 / 3.2 ఎంపీ కెమెరాలు, 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలున్న సంగతి తెలిసిందే.

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఫోన్లనయితే డెలివరీ చేయలేదు గానీ, అప్పుడే మరో సంచలన ప్రకటన మాత్రం చేసింది. ఎల్ఈడీ స్క్రీన్, హెచ్? డీ రిజల్యూషన్? తో ఇంతవరకు ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఫ్రీడమ్ టీవీని ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని.. ఫోన్ ఇవ్వడానికే ఇంత ఆలస్యం చేసి ఇన్ని వాయిదాలు వేసినవాళ్లు ఇక టీవీలు అందించడానికి ఇంకెంత ఆలస్యం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

 

 

మోడీ 50 వేల కోట్లు ఇస్తే.. రూ. 251 ఫోన్ల కొత్త రాగం

మరొక్క రోజు ఆగితే ఫ్రీడమ్ టీవీల విషయం కూడా తెలిసిపోతుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Now Ringing Bells wants Rs 50,000 crore from Indian Govt
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot