లాస్ట్ డే, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Written By:

ఫ్లిప్‌కార్ట్ హోస్ట్ పేరుతో బంపర్ బొనాంజాని ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 13 వరకు మూడు రోజుల పాటు ఈ మొబైల్ ఫెస్ట్ ని నిర్వహించనుంది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ లో శాంసంగ్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. ఇటీవలే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ తో షియోమి స్మార్ట్ ఫోన్ వినియోగదారులను మైమరిపించిన సంగతి తెలిసిందే. షియోమి తర్వాత వెంటనే దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కూడా మొబైల్ ఫెస్టివల్ కు తెరలేపింది. డిస్కౌంట్ పొందిన మొబైల్స్ ఏంటో చూద్దాం.

కసి మీద ఉన్న జియో, ఏం చేయబోతోంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ పై

గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. 18,490 రూపాయలు కలిగిన ఈ ఫోన్ ను 3 వేల రూపాయల డిస్కౌంట్ పై 15,490లకు అందుబాటులోకి తెచ్చింది. అదే ఎక్స్చేంజ్ పై అయితే రూ.14,500 ధరను తగ్గిస్తోంది.

గెలాక్సీ జే5 ధర

ఈ మొబైల్ ఫెస్టివల్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ జే5 ధర రూ.10,990నే. ఈ ఫోన్ పై కూడా ఎక్స్చేంజ్ పై 10వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ జే5 అసలు ధర రూ.13,290.

శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రొ మీద

శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రొ మీద రూ. 2590 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ని అందిస్తోంది. ఎక్స్చేంజ్ పై అయితే రూ.16000 వరకు ధరను తగ్గిస్తోంది.

ప్రారంభ ధర 1722 రూపాయలకు

ఎలాంటి ఈఎంఐ ధరలు లేకుండా ప్రారంభ ధర 1722 రూపాయలకు శాంసంగ్ ఫోన్లను పొందవచ్చు.

మిగతా శాంసంగ్ ఫోన్లు

ఇలా మిగతా శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఆన్7, గెలాక్సీ ఆన్8, గెలాక్సీ ఆన్9, గెలాక్సీ సీ9ప్రొ పై కూడా కంపెనీ ఎక్స్చేంజ్, డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. అయితే ఎక్స్చేంజ్ ఏ ఫోన్ తో చేసుకోవాలో కంపెనీ తెలుపలేదు.

1జీబీ డేటా ఖరీదుపై 14జీబీ డేటాను

దీనిలో భాగంగా టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ కూడా 1జీబీ డేటా ఖరీదుపై 14జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart hosts Samsung Mobiles Fest from April 11 to 13; offers discounts read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot