కసి మీద ఉన్న జియో, ఏం చేయబోతోంది..?

Written By:

జియో టెల్కోలపై మంచి కసి మీదనే ఉంది. ఏకంగా మీ ఆఫర్లు విరుద్ధంగా ఉన్నాయంటూ విమర్శలు కురిపించింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్‌లు.. తమ వినియోగదారులను నిలుపుకోవడానికి నిబంధనలకు విరుద్ధమైన ఆఫర్లను అందిస్తున్నాయని తీవ్రమైన ఆరోపణలు చేసింది.

త్వరగా రీచార్జ్‌ చేసుకోవాలంటూ జియో కస్టమర్లను కోరడం కరెక్టేనా..?

మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కింద వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకుంటున్న వినియోగదారులకు నిబంధనలకు విరుద్ధమైన ఆకర్షణీయమైన ఆఫర్లను ఆయా టెలికం కంపెనీలు అందిస్తున్నాయని టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్‌కు రాసిన ఒక లేఖలో రిలయన్స్‌ జియో పేర్కొంది.

కెమెరా అంటే ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యంత కఠినమైన చర్యలను

ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నందుకు గాను సదరు టెలికం కంపెనీలపై అత్యంత కఠినమైన చర్యలను, భారీ జరిమానాలను విధించాలని ఆ లేఖలో రిలయన్స్‌ జియో డిమాండ్‌ చేసింది. అయితే ఈ ఆరోపణలను పోటీ కంపెనీలు తోసిపుచ్చాయి. అవి ఎదురుదాడికి దిగాయి.

వొడాఫోన్‌ టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌కి ఫిర్యాదు

అయితే జియో అందిస్తోన్న సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌పై టెలికం కంపెనీ వొడాఫోన్‌ టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌కి ఫిర్యాదు చేసింది.

ఆఫర్‌లో నిబంధనల ఉల్లంఘన ఉందని

ప్రకటిత సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌లో నిబంధనల ఉల్లంఘన ఉందని రెగ్యులేటర్‌ తెలియజేసినప్పటికీ జియో ఆ ఆఫర్‌ను ఇంకా కొనసాగిస్తోందని ఫిర్యాదులో ఆరోపించింది.

కొత్త సీసాలో పాత సారాయి

ఇక ఎయిర్ టెల్ అయితే జియో ఆఫర్లు కొత్త సీసాలో పాత సారాయి అన్న చందంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది. పాత ఆఫర్లను మార్చి మార్చి వినియోగదారులకు అందించిందని ఆరోపించింది.

ధన్ ధనా ధన్ పేరుతో

ధన్ ధనా ధన్ పేరుతో జియో టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ. 309 రీ ఛార్జ్ తో మూడు నెలల పాటు 1 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఈ ఆఫర్ లో వాడుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio seeks Trai action against Airtel, Vodafone, Idea for violating rules read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot