భారీ డిస్కౌంట్ ధరల్లో ఐఫోన్లు

Written By:

మీరు ఐఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే ఇదే సరైన అవకాశం. దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆపిల్ ఫెస్ట్ పేరిట జరిగే ఈ ఫెస్ట్‌ జనవరి 10 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు అలరించనుంది. ఐఫోన్లపై మాత్రమే కాకుండా ఆపిల్ యాక్ససరీస్‌పై కూడా డిస్కౌంట్లను ఈ సైట్ ప్రకటించింది. దీంతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఐఫోన్ 6 కొనుగోలు చేసేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఆపిల్ ఫెస్ట్‌లో డిస్కౌంటపై ఓ లుక్కేయండి.

ఎయిర్‌టెల్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7 జెట్ బ్లాక్

ఆపిల్ 128 జీబీ ఐఫోన్ 7 జెట్ బ్లాక్ 7 శాతం డిస్కౌంట్ తో రూ .65 వేలకే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి చార్జీలు లేని ఈఎంఐ ప్లాన్ నెలకు రూ .5,147 చెల్లిస్తే ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్చేంజ్‌పై రూ .23 వేల వరకు డిస్కౌంట్

రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ .3,152 చెల్లించాలని. ఎక్స్చేంజ్‌పై రూ .5000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా ధరపై రూ .3000 తగ్గింపు ఉంది. అలా ఎక్స్చేంజ్‌పై రూ .23 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ 32 జీబీ

32 జీబీ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ ఫోన్ అయితే 7 శాతం డిస్కౌంట్‌కి రూ .55,000 కు విక్రయించనున్నారు. ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేవు. ఎక్స్ఛేంజ్‌పై రూ .23 వేల డిస్కౌంట్. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ .3,000 డిస్కౌంట్. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ 128 జీబీ

128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్‌ను రూ .65,000కే విక్రయించనున్నారు. అలాగే ఐఫోన్ 7 256 జీబీ జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్‌ను 6 శాతం డిస్కౌంట్‌తో రూ .75,000కు ఆపిల్ విక్రయించనుంది.

ఐఫోన్ 7 ప్లస్

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ వేరియంట్ జెట్ బ్లాక్ ఆప్షన్‌ను రూ .82 వేలకే కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా దీనిపై రూ .23 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ రెగ్యులర్ వాల్యుపై మరో రూ .3 వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. .

ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ వేరియంట్ రోజ్ గోల్డ్ ఆప్షన్‌ను కూడా రూ .82 వేలకే లభ్యం కానుంది. జెట్ బ్లాక్ రంగులో ఇతర వేరియంట్లు 258 జీబీ వేరియంట్ ధర రూ .92 వేలు. ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ వేరియంట్ జెట్ బ్లాక్ ఆప్షన్‌కు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్లనే ఈ ఫోన్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నారు.

ఐఫోన్ 6 ఎస్

ఆపిల్ ఐఫోన్ 6 16 జీబీ స్పేస్ గ్రే వేరియంట్ రూ .31,990 కు కొనుకోవచ్చు. ఎక్స్చేంజ్‌పై రూ .24 వేల వరకు డిస్కౌంట్ ఉంది. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ .4,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈఎంఐ రూ .1,552 కే ప్రారంభమవుతుంది.

ఐఫోన్ 6ఎస్ 32 జీబీ

ఆపిల్  ఐఫోన్ 6ఎస్ 32 జీబీ స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు రూ .46,999 కు లభ్యం కానున్నాయి .. ఎక్స్చేంజ్‌పై రూ .23 వేల వరకు డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ .3000 తగ్గింపు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 6 ఎస్ ప్లస్

ఆపిల్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్ 32 జీబీ సిల్వర్, రోజ్ గోల్డ్ ఫోన్లు రూ .56,999 కు అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్చేంజ్‌పై రూ .23 వేల డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ .3,000 డిస్కౌంట్‌ ను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 5 ఎస్

16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ ను రూ.19,999 కు ఆపిల్ అందించనుంది. ఎక్స్చేంజ్‌పై రూ .15 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై ఫ్లాట్ డిస్కౌంట్ 50, 25 శాతం ఆఫర్ చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart’s ‘Apple Fest’: Top deals on iPhone 7, iPhone 6 and more read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot