ఎయిర్‌టెల్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన జియో

Written By:

రిలయన్స్ జియో ఎయిర్‌టెల్‌కు షాకిచ్చింది. దేశంలో ఇప్పటిదాకా పాస్టెస్ట్ 4జీ సర్వీసు తమదేనంటూ దాదాపు ఏడాది క్రితం ఎయిర్‌టెల్‌ యాడ్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే..అయితే అది ఇప్పుడు మారింది. పాస్టెస్ట్ 4జీ విషయంలో ఎయిర్‌టెల్‌ను జియో అధిగమించింది. ట్రాయ్ డిసెంబర్ లో విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో అత్యంత వేగవంతమైన 4జీ సర్వీసు జియోదేనని తేల్చి చెప్పింది.

జియో తీపికబురు, ఈ సారి కష్టమర్లకు కాదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ఈమేరకు దూకుడు

భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) డిసెంబర్ లో విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో అత్యంత వేగమైన 4 జీ సర్వీసు ప్రొవైడర్ గా జియో నిలిచింది. గత ఏడాది అక్టోబర్ వరకు 4 జీ సెవలలో అత్యంత నెమ్మదైన సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న జియో ఈమేరకు దూకుడు పెంచడం గమనార్హం.

మైస్పీడ్ ఆన్ లైన్

దేశవ్యాప్తంగా నిర్వహించిన డాటా స్పీడ్ పరీక్ష వివరాలను ట్రాయ్ కు చెందిన 'మైస్పీడ్ ఆన్ లైన్' పోర్టల్ లో తాజాగా వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం ప్రస్తుతం 9.9 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో జియో 4 జీ మొదటి స్థానంలో నిలిచింది.

ఎయిర్ టెల్ రెండో స్థానంలో

5.8 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంది. 4.2 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో వొడాఫోన్ మూడోస్థానంలో నిలిచింది. ఐడియా, రిలయన్స్, టెలినార్, సెల్ వన్, ఎయిర్ సెల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టెలినార్ మొదటి స్థానం

ఇక అప్ లోడ్ స్పీడ్ లో 2.8 ఎంబీపీఎస్ వేగంతో టెలినార్ మొదటి స్థానంలో ఉండగా, 2.6 ఎంబీపీఎస్ స్పీడ్ తో జియో రెండోస్థానంలో ఉంది.

మార్చ్ 31 వరకు ఉచితం

జియో తాజాగా తన వినియోగదారులకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట వచ్చే మార్చ్ 31 వరకు ఉచితంగా వాయిస్ కాల్స్, డాటా, వీడియోకాల్స్, ఎస్సెమ్మెస్ ఆఫర్ కొనసాగించిన సంగతి తెలిసిందే.

4 జీబీని 1 జీబీకి

కాగా, గతంలో రోజుకు ప్రతి వినియోగదారుడికి ఉపయోగించే 4 జీ డాటా లిమిట్ 4 జీబీని 1 జీబీకి కుదించింది. 1 జీబీ తర్వాత 128 కేబీపీఎస్ వేగంతో డాటా సర్వీసును అందించనున్నట్టు పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio beats Vodafone, Airtel in 4G data speeds: TRAI read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot