లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

Written By:

ఫ్రీడం 251 ఫోన్లు మీరు అందుకోవాలంటే మీకు అదృష్టం ఉండాలట..కంపెనీ తీసే లక్కీ డ్రాలో మీ పేరు వస్తే మీకు ఆ ఫోన్ డెలివరీ చేస్తారట..సంచలనాలతో దూసుకుపోతున్న ఫ్రీడం 251 ఫోన్ యాజమాన్యం చేస్తున్న సరికొత్త ఆఫర్ ఇది. లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసిన కష్టమర్లకు రూ. 251 ఫోన్లు అందజేస్తామని కంపెనీ చెబుతోంది. అదెలాగో మీరే చూడండి.

రింగింగ్ బెల్స్ నుంచి రూ.251 ఫోన్, రూ.9,900 టీవీ (వచ్చేసాయ్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

ఎన్నో వాయిదాల పర్వం అనంతరం తొలి విడతగా 5000 యూనిట్ల ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్లను డెలివరీ చేసినట్లు చెప్పిన రింగింగ్ బెల్స్ సంస్థ, ఇప్పుడు మరిన్ని స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టిందట.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

అయితే ఈ సారి ఈ పంపిణీని లాటరీ నుంచి ఎంపికచేసిన వినియోగదారులకు అందిస్తోందట. అయితే ఈ విడతలో అందుకోబోతున్న లక్కీ కస్టమర్లు ఎవరో అన్ని వినియోగదారుల్లో ఆతృత చోటుచేసుకుంది.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

లాటరీ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రర్ వినియోగదారులను ఎంపికచేసి, రెండోవిడతగా మరో 65 వేల ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ ప్రారంభించామని రింగింగ్ బెల్స్ ప్రకటించింది. మొత్తం షిప్పిమెంట్‌ను 70 వేలకు చేర్చుకోనుంది.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

పశ్చిమ బెంగాల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, న్యూఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖాండ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ డెలివరీ చేపట్టినట్టు వెల్లడించింది.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

బడా బడా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు షాకిస్తూ ఎవరూ ఊహించినంతగా కేవలం 251 రూపాయలకే ఫ్రీడమ్ స్మార్ట్‌ఫోన్‌ను రింగింగ్ బెల్స్ విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ధరకు స్మార్ట్‌ఫోన్ వస్తుండటంతో, ఒక్కసారిగా ఈ ఫోన్‌కు 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తాయి.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

చాలా రోజులు ఊరిస్తూ వచ్చిన రింగింగ్ బెల్స్ ఆఖరికి గత నెలలో మొదటి డెలివరీ కింద 5000 స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసినట్లు తెలిపింది అయితే కష్టమర్లు మేము తీసుకున్నట్లు ఎక్కడా ఎవరూ చెప్పినట్లు కనపడటం లేదు.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

తక్కువ ధరకు క్వాలిటీ ఫోన్‌ను అందించడంపై కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వారి సంతృప్తికరమైన స్పందన తమకు అపారమైన ఆనందాన్ని చేకూర్చిందంటున్నారు.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

కనీసం రెండు లక్షల రిజిస్ట్రర్ యూజర్లకు ఈ ఫోన్లను డెలివరీ చేయాలనుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది. మరో రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను, నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను, 31.5 ఎల్ఈడీ టీవీని రింగింగ్ బెల్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

మరి ముందు ముందు ఈ రూ. 251 ఫోన్ ఇంకెన్ని సంచలనాలకు వేదికగా మారుతుందో చూడాలి.

లాటరీ లక్కీ బాయ్‌కే రూ. 251 ఫోన్..ఆ అదృష్టం ఎవరికో..

మోడీ రూ.50 వేల కోట్లు ఇస్తే..రూ.251 ఫోన్ల కొత్త రాగం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Freedom 251 Maker Starts Delivery of 65,000 Units to Customers
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot