గెలాక్సీ నోట్ 5.. ఆసక్తికర రూమర్లు

Posted By:

బెర్లిన్ వేదికగా ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐఎఫ్ఏ టెక్నాలజీ ట్రేడ్ షోను పురస్కరించుకుని సామ్‌సంగ్ గత నాలుగు సంవత్సరాలుగా తన గెలాక్సీ నోట్ సిరీస్ డివైస్‌లను ఆవిష్కరిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఐఎఫ్ఏ 2015ను పురస్కరించుకుని సామ్‌సంగ్ విడుదల చేయబోయే గెలాక్సీ నోట్ డివైస్‌కు సంబంధించి ఆసక్తికర రూమర్లు వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

(ఇంకా చదవండి: వాట్సాప్ వాయిస్ కాలింగ్ చవకేమి కాదు)

గత కొంత కాలంగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఐఎఫ్ఏ 2015 వేదికగా గెలాక్సీ నోట్ 4కు సక్సెసర్ వర్షన్ అయిన గెలాక్సీ నోట్5ను సామ్‌సంగ్ ప్రకటించాల్సి ఉంది. అయితే, గెలాక్సీ నోట్ 5 ఆవిష్కరణకు సంబంధించి సామ్‌సంగ్ ఇప్పటి వరకు ఏ విధమైన సూచనలు చేయకపోవం విశేషం. అయితే, రూమర్ మిల్స్ మాత్రం గెలాక్సీ నోట్ 5కు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తెస్తూ యధావిధిగా తమ పనిని తాము చేసుకుపోతున్నాయి.

సామ్‌సంగ్ నుంచి ఈ ఏడాది విదదలయ్యే అవకాశమున్న గెలాక్సీ నోట్ 5కు సంబంధించి పలు ఆసక్తికకర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ నోట్ 5, 2కే లేదా 4కే రిసల్యూషన్ డిస్‌ప్లేను సపోర్ట్ చేసే అవకాశం.

గెలాక్సీ నోట్ 5 ప్రీమియమ్ డిజైనింగ్ లుక్‌తో అలరించే అవకాశముంది.

గెలాక్సీ ఎస్6 తరహాలోనే మెటల్ ఇంకా గ్లాస్ - క్లాడ్ డిజైన్‌ను గెలాక్సీ నోట్ 5లో ఉపయోగించే అవకాశం.

గెలాక్సీ నోట్ 5, డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో లభ్యమయ్యే అవకాశం.

గెలాక్సీ నోట్ 5, ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేసే అవకాశం.

గెలాక్సీ నోట్ 5లో శక్తివంతమైన ఎక్సినోస్ 7422 చిప్‌సెట్‌ను పొందుపరిచే అవకాశం.

గెలాక్సీ నోట్ 5, 16 మెగా పిక్సల్ ప్రమైరీ కెమెరాతో లభ్యమయ్యే అవకాశం,

గెలాక్సీ నోట్ 5ను బెర్లిన్‌లో నిర్వహించే ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ట్రేడ్‌షోలో సామ్‌సంగ్ ఆవిష్కరించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Galaxy Note 5 Rumour Roundup: Release Date, Features, Specifications and More. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot