వాట్సాప్ వాయిస్ కాలింగ్ చవకేమి కాదు

Posted By:

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి రావటంతో తక్కువ ఖర్చుతో తెగ మాట్లాడేసుకోవచ్చని చాలామంది సంబరుపడ్డారు. అయితే, వాట్సాప్ వాయిస్ కాలింగ్ అంత చవకేమి కాదిన ఆండ్రాయిడ్‌పిట్ టెస్ట్ నిగ్గు తేల్చింది.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ చవకేమి కాదు

ఈ టెస్ట్ వెల్లడించిన వివరాల మేరకు ఆండ్రాయిడ్ ఇంకా ఐఫోన్ యూజర్లకు కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ వాయిస్ కాలింగ్ యాప్ ద్వారా కాల్స్ చేయటం వల్ల నిమిషానికి 1.3 ఎంబి డేటా ఖర్చవుతోందట. ఈ లెక్కన 500 ఎంబీ డేటా ప్లాన్ కేవలం ఆరు గంటల్లో ఖర్చయిపోతుందట. నెలకు 500 ఎంబి డేటా ప్లాన్ తో సరిపెట్టుకునే వాళ్ల వాట్సాప్ వాయిస్ కాలింగ్ ద్వారా రోజుకు 11 నిమిషాలు మాట్లాడేందుకు మాత్రమే వీలుంటుంది.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ చవకేమి కాదు

భారత్‍‌లోని వాట్సాప్ యూజర్లు ఏ విధమైన ఇన్విటేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోగలుగుతున్నారు. ఒకవేళ ఇప్పటికి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ కానట్లయితే.. వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి 2.12.19 వర్సన్‌ ఏపీకే ఫైల్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌‌స్టాల్ చేసుకోండి. ఇక నేరుగా వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ చవకేమి కాదు

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సపోర్ట్ చేయాలంటే మీ డివైస్ ఆండ్రాయిడ్ 2.1 లేదా ఆపై ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేసిదిగా ఉండాలి. ఈ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో నిరాటంకంగా పనిచేయాలంటే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా ప్లాన్‌ను ఎంపిక చేసుకోండి. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ టాబ్లెట్ డివైస్‌లను సపోర్ట్ చేయదు. (ఇంకా చదవండి:30,000 ధరల్లో..10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు)

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం యాపిల్ ఐఓఎస్ యూజర్లు మరికొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు.

English summary
WhatsApp calls may not be as cost-effective as you first thought. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot