ఆధార్ కార్డు ఉంటే రూ.1700కే ఐఫోన్ 7..

Written By:

పండుగ సంధర్భంగా ఓ ఆఫర్ ఇప్పుడు ఇండియాలోని ఐఫోన్ అభిమానులను తెగ ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆపిల్ ఐఫోన్స్ ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది నిజంగా ఓ పెద్ద శుభవార్త లాంటిదే. మీడియా రిపోర్టుల ప్రకారం మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కేవలం రూ. 1700 చెల్లించి మీరు ఐఫోన్ 7 సొంతం చేసుకోవచ్చు. ఏందీ నమ్మలేకున్నారా...నిజం..ఆపిల్ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓ స్మార్ట్ లుక్కేయండి.

త్వరపడండి :ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆధార్ కార్డుతో

మీరు ఆధార్ కార్డుతో రూ. 1700 చెల్లించి ఐఫోన్ 7ని  మీ సొంతం చేసుకోవచ్చు. అయితే మిగతా మొత్తాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తం పెట్టలేని వారికి ఇది నిజంగా శుభవార్త లాంటిదే.

చర్చలు జరిపే అవకాశం

ఈ అద్భుతమైన ఆఫర్ గురించి ఆపిల్ ఇండియాలోని బ్యాంకులతో చర్చలు జరిపే అవకాశం ఉందని మీడియా రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అక్టోబర్ 7న ఇండియా మార్కెట్లోకి ఆపిల్ 7 రానున్న నేపథ్యంలో ఈ లోపే ఈ ఆఫర్ ని ఇండియాలోకి తీసుకురావాలని ఆపిల్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా

అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు వస్తున్న ఆపిల్ ఇండియా బ్యాంకులతో త్వరలో ఈ విషయమై సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అదే జరిగితే మీరు ఆధార్ కార్డుతో కేవలం రూ. 1700 చెల్లించి ఐఫోన్ 7ని సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 7, 7 ప్లస్ లు

గత వారమే ఐఫోన్ 7, 7 ప్లస్ లు శాన్ ప్రానిస్క్ లో విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ రెండు వేరియంట్లు 32GB, 128GB, 256GB స్టోరేజ్ తో రానున్నాయి. కలర్స్ విషయానికొస్తే సిల్వర్ ,రోజ్ అండ్ గోల్డ్ కలర్స్ లో ఇవి లభ్యం కానున్నాయి.

న్యూజెట్ బ్లాక్ కలర్ వేరియంట్

అయితే న్యూజెట్ బ్లాక్ కలర్ వేరియంట్ ఒక్కటే 128GB, 256GBలతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 32 జిబి ధర రూ. 60 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అప్పుడే అవుట్ అఫ్ స్టాక్ అని కంపెనీ తెలిపింది. 

సరికొత్త quad-core Apple A10 Fusion processor

 4.7 ఇంచ్ డిస్ ప్లేతో 3డీ టచ్ తో ఐఫోన్ 7 రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐఫోన్7 ప్లస్ 5.5 ఇంచ్ రెటినా హెచ్ డి డిస్ ప్లేతో పాటు 3డి టచ్ తో రానుంది. ఇవి రెండు మోడళ్లు సరికొత్త quad-core Apple A10 Fusion processorతో రానున్నాయి.

దాదాపు 40 శాతం ఫాస్ట్ గా రన్

గత జనరేషన్ ఫోన్లతో పోలిస్తే దాదాపు 40 శాతం ఫాస్ట్ గా రన్ అవుతాయి. కెమెరా విషయానికొస్తే iPhone 7 12 ఎంపీ ఐసైట్ కెమెరాతో, 4కె వీడియో రికార్డింగ్ తో రానుంది. అదే ఐఫోన్ 7ప్లస్ 12 ఎంపీ కెమెరాతోపాటు వన్ వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ తో రానుంది.

సెల్ఫీ విషయానికొస్తే

సెల్ఫీ విషయానికొస్తే రెండు మోడళ్లు 7 ఎంపీ సెల్పీ కెమెరాతో రానున్నాయి. వీటితో పాటు డస్ట్ అండ్ వాటర్ రిసిస్టెంట్ తో ఆపిల్ నుంచి రానున్న మొట్టమొదటి ఫోన్లు ఇవేనని కంపెనీ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Get iPhone 7 at only Rs 1,700 by using Aadhar card–Know how read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot