6జిబి ర్యామ్, 4 కెమెరాలతో Gionee S10

Written By:

చైనా దిగ్గజం జియోని తన సరికొత్త ఫోన్ ని అతి త్వరలో లాంచ్ చేయనుంది. Gionee S10 పేరుతో ఈ మొబైల్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. 6జిబి ర్యామ్ తో రానున్న ఈ ఫోన్ 4 కెమెరాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఫోన్ మే 26న మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

జియోకి షాక్ , ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

లీకయిన వివరాల ప్రకారం Gionee S10 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో రానుంది. 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద ఈ ఫోన్ ఆరపేట్ కానుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4/6 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. మైక్రో ఎస్ డీ ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలును పొందుపరిచారు. అలాగే సెల్ఫీ అభిమానుల కోసం 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలున్నాయి.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3450 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. మెటల్ బాడీతో రానున్న ఈ ఫోన్ అభిమానులను అలరిస్తుందని జియోని ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆండ్రాయిడ్ 7.0 నూగట్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఫీచర్లు. ధర ఎంతన్నది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gionee S10 with four cameras to launch on May 26 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot