జియోకి షాక్ , ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ డేటా
ఉచిత ఆఫర్లతో షాకుల మీ షాకులు ఇస్తున్న రిలయన్స్ జియోకి ఎయిర్‌టెల్ షాకివ్వబోతోంది.
ఉచిత ఆఫర్లతో షాకుల మీ షాకులు ఇస్తున్న రిలయన్స్ జియోకి ఎయిర్‌టెల్ షాకివ్వబోతోంది. జియోకి పోటీగా తన ప్లాన్లను భారతి ఎయిర్‌టెల్ రివ్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే మై హోం పథకంలో మరో బంపర్‌ఆఫర్ తో ముందుకువవచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్‌లో మునుపటి 5 జీబీ డేటా ఆఫర్‌ను రెట్టింపు చేసింది.
ఇదే..షియోమిని రికార్డుల వైపు నడిపిస్తోంది

నెలకు10 జీబీ డేటా
ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది.

మై ఎయిర్‌టెల్ ఆప్
ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రకారం ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ తో పాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ , డిజిటల్‌టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మై ఎయిర్‌టెల్ ఆప్‌లో మై హోమ్ ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది.

మై హోం యాప్‌లో
మై హోం యాప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉందనీ, ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ లేదా ఎయిర్‌టెల్ పోస్ట్పెయిడ్ కనెక్షన్ లేదా ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ సర్వీస్ కలిగిన వినియోగదారులు ఈ అవకాశాన్నివినియోగించుకోవచ్చని తెలిపింది.

జులై 1, 2016కి ముందు
గతంలో 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జులై 1, 2016కి ముందు ప్రారంభించిన వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.

పరిమితులను
ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడం తోపాటు, బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల (ఇప్పటివరకు 25 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, 25డీటీహెచ్ కనెక్షన్లకు పరిమితం) పరిమితులను కూడా తొలగించింది.

250 జిబి డేటా
దీంతో పాటు 25 కనెక్షన్స్ ఇప్పించిన వారికి ప్రతి కనెక్షన్స్ కి 5జిబి చొప్పున 250 జిబి డేటా వినియోగదారులకు రానుంది. ఈ డేటాని నెలంతా వాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications








