64జీబి ఇంటర్నల్ మెమరీతో ‘జియోనీ ఇలైఫ్ ఇ8’

Posted By:

64జీబి ఇంటర్నల్ మెమరీతో  ‘జియోనీ ఇలైఫ్ ఇ8’

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ జియోనీ తన ఇ సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ‘ఇలైఫ్ ఇ8' పేరుతో ప్రపంచానికి పరిచయమైన ఈ ఫోన్ శక్తివంతమైన 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఎన్ఎక్స్‌పీ స్మార్ట్ పీఏ ఆడియో చిప్, స్టీరియో స్పీకర్స్ విత్ డీటీఎస్ సపోర్ట్, ఫింగర్ - ఫ్రింట్ స్కానర్, జియోనీ వాలెట్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. భారత కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ విలువ రూ.41,148 ఉండొచ్చు. జూలై 15 నుంచి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది.

64జీబి ఇంటర్నల్ మెమరీతో  ‘జియోనీ ఇలైఫ్ ఇ8’

జియోనీ ఇలైఫ్ ఇ8 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

6 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), 2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్ 10 (ఎంటీ6795) ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫోన్ మందం 9.6 మిల్లీ మీటర్లు, బరువు 207 గ్రాములు, 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ లోన్ ఎల్ఈడి ఫ్లాష్‌తో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అమిగో 3.1 యూజర్ ఇంటర్‌‍ఫేస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఏ2డీపీ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3520 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

(చదవండి: హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ )

English summary
Gionee Unveils Elife E8 with 6-inch QHD Display, 64GB Internal Memory and Gionee Wallet. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot