రూ.3,000కే స్మార్ట్‌ఫోన్ అంటున్న గూగుల్

Posted By:

భారత్‌లో తమ ఆండ్రాయిడ్ వన్ ప్రొజెక్ట్‌ను రీబూట్ చేసే యోచనలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది. కార్బన్, స్పైస్, మైక్రోమాక్స్ కంపెనీలు భాగస్వామ్యంతో గూగుల్ తన ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను గతేడాది సెప్టంబర్‌లో భారత్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read More: లేటెస్ట్ 4జీ ఫోన్ కేవలం రూ.4,999కే

బడ్జెెెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూ.6,500 ధర శ్రేణిలో విడుదలైన ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు ఆశించినంత స్థాయిలో జనంలోని వెళ్లలేకపోయాయి. ఈ క్రమంలో భారీ పెట్టుబడులకు తెరలేపిన గూగుల్ రూ.2,000 నుంచి రూ.3,000 ధర పరిధిలో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ద ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మీ ఆండ్రాయిడ్ డివైస్‌‌ను సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు పాటించవల్సిన చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి

 స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

డేటాను ఎన్‌క్రిప్ట్ చేసుకోండి

డేటాను ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఉదాహరణకు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన సమచారం ఉందనుకుందాం. ఇతరులు ఆ సమాచారాన్ని యాక్సెస్ చెయ్యకుండా ఆ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్థేశిత పాస్‌‍వర్డ్ లేదా పిన్ ఆధారంగా సదరు డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారి డిక్రిప్ట్ అయి మీకు కనబుడుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.

ఆఫీస్ కార్యాకలాపాలకు

ఆఫీస్ కార్యాకలాపాలకు మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ముందు పటిష్టమైన సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఇందకుగాను ఐటీ ప్రొఫెషనల్స్ సలహాలను తీసుకోండి.

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి.

అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి

 మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

వ్యక్తిగత సమచారాన్ని

వ్యక్తిగత సమచారాన్ని ఫోన్‌లోని ఎస్‌డి కార్డ్‌లలో స్టార్ చేయటం మంచిది కాదు. కాబట్టి ఆ అలవాటును మానుకోండి.

అనధికారిక యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసేముందు

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో అనధికారిక యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి.

డివైస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా

ఆండ్రాయిడ్ డివైస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచండి.బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ చేయటం మరవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google is Launching Android One at Rs 3000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting