Home
Mobile

50MP + 48MP + 48MP + 48MP కెమెరాలతో గూగుల్‌ పిక్సల్‌ ఫోన్‌లు వచ్చేశాయ్‌..!

Google Pixel 10 Pro, Pixel 10 Pro XL Smartphones : గూగుల్‌ పిక్సల్ 10 సిరీస్‌లో భాగంగా ఇందులో పిక్సల్ 10, పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో XL మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు గూగుల్‌ టెన్సార్‌ G5 చిప్‌, టైటాన్‌ M2 సెక్యూరిటీ చిప్‌ ను కలిగి ఉన్నాయి. గూగుల్‌ పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో XL స్మార్ట్‌ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

పిక్సల్‌ 10 ప్రో, 10 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
పిక్సల్‌ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల సూపర్‌ అక్వా OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే పిక్సల్‌ 10 ప్రో XL ఫోన్ 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రో మోడల్స్‌ 1-120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 3300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతాయి.

Google Pixel 10 pro and Pixel 10 pro XL smartphones

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో XL రెండు ఫోన్లు, గూగుల్ టెన్సార్‌ G5 చిప్‌ (Tensor G5 Chip) పైన పనిచేస్తాయి. ఈ చిప్‌సెట్ 16GB ర్యా్మ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 7 ఆండ్రాయిడ్‌ OS, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా పిక్సల్ 10 ప్రో మోడల్స్ 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్‌ లెన్స్, 5x జూమ్ సామర్థ్యంతో 48MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 48MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్లు జెమినీ స్టూడియో, బెస్ట్‌ టేక్‌, పొర్ట్రెయిట్‌ లైట్‌, Magic Eraser, Zoom Enhance వంటి ఫీచర్లను కలిగి ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్ స్పెసిఫికేషన్‌లు :
పిక్సల్‌ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 30W వైర్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4870mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అదే పిక్సల్‌ 10 ప్రో XL స్మార్ట్‌ఫోన్ 45W వైర్‌ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో XL ధర వివరాలు :
గూగుల్‌ పిక్సల్ 10 ప్రో 256GB వేరియంట్ ధర రూ.1,09,999 గా ఉంది. అదే పిక్సల్‌ 10 ప్రో XL మోడల్‌ ధర రూ.124999 గా ఉంది. ఈ రెండు ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పిక్సల్‌ 10 ప్రో మోడల్‌ మూన్‌స్టోన్, జడే, పార్సిలియన్‌, ఒబ్సిడియన్ కలర్స్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే పిక్సల్‌ 10 ప్రో XL స్మార్ట్‌ఫోన్‌ మూన్‌స్టోన్, జడే, ఒబ్సిడియన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 10 pro and Pixel 10 pro XL smartphones launched with tensor G5 Chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X