రూ. 13 వేలకే గూగుల్ పిక్సల్ ఫోన్లు

Written By:

నెక్సస్ ఫోన్లకు గతేడాది బైబై చెప్పి పిక్సల్ ఫోన్లతో మార్కెట్లోకి గూగుల్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హైఎండ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధరలు ఐఫోన్ కి ధీటుగా ఉండటంతో వాటిని కొనాలనుకున్న వారికి నిరాశే ఎదురయింది. సామాన్యులయితే ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అదీగాక మార్కెట్లో బడ్జెట్ ఫోన్లకు బాగా డిమాండ్ ఉండటంతో గూగుల్ కూడా బడ్జెట్ ఫోన్లపై దృష్టి పెట్టింది.

సైబర్ మోసాల్లో ఒక్కో యూజర్ ఎంత నష్టపోయాడంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తక్కువ ధర ఫోన్‌ను

ప్రస్తుతం బడ్జెట్‌ ఫోన్లకు మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉంటుండడంతో గూగుల్‌ త్వరలో తక్కువ ధర ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

పిక్సెల్‌ పీ2, పిక్సెల్‌ పీబీ పేర్లతో

ఈ ఏడాది పిక్సెల్‌ పీ2, పిక్సెల్‌ పీబీ పేర్లతో రెండు మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానుందట. అందులో ‘పిక్సెల్‌ పీ2' ధర ఇప్పుడున్న పిక్సెల్‌ ఫోన్లకంటే ఎక్కువగానే ఉంటుందట.

పిక్సెల్‌ పీబీ ధర మాత్రం చాలా తక్కువ

పిక్సెల్‌ పీబీ ధర మాత్రం చాలా తక్కువ ఉండనుందట. పిక్సెల్‌ పీ2లో వాటర్‌ ప్రూఫ్‌తో పాటు కెమెరా సాంకేతికతను మెరుగుపరిచేందుకు గూగుల్‌ కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.

పిక్సల్ ఫోన్ల మాదిరిగానే

ర్యామ్‌ సామర్థ్యంతోపాటు, డిస్‌ప్లే రిజల్యూషన్‌నూ పెంచుతోందని సమాచారం. పిక్సల్ ఫోన్ల మాదిరిగానే రానున్న ఈ ఫోన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

రూ.13,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉండే అవకాశం

గూగుల్‌ బడ్జెట్‌ ఫోన్‌ ధర రూ.13,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫోన్లను ఈ ఏడాది మధ్యలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel 2B Budget And Pixel 2 Flagship Phone Details Leak Out read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot