సైబర్ మోసాల్లో ఒక్కో యూజర్ ఎంత నష్టపోయాడంటే..?

Written By:

సైబర్ దాడులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఈ దాడుల కారణంగా యూజర్లు తమ సొమ్మును చాలా మొత్తంలోనే కోల్పోతున్నారని సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై ల్యాబ్ తెలిపింది. ఇంటర్నెట్ వాడకం వల్ల వినియోగదారులు సగటున రూ. 32,400 సైబర్ దాడుల భారీన పడి నష్టపోయారని సంస్థ తెలిపింది.

డేంజర్ జోన్‌లో లక్ష హెచ్‌పీ ల్యాపీలు

దీంతో పాటు సైబర్‌ దాడుల్లో సొమ్ములు పోగొట్టుకున్నవాళ్లలో 52 శాతం మంది మాత్రమే తమ సొమ్ముల్లో కొంచెమైనా వెనక్కి పొందగలిగారని ఈ సంస్థ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకోమంటూ యూజర్లకు కొన్ని సలహాలు కూడా ఈ నివేదిక ఇచ్చింది.

జియోని ఢీ కొడుతున్న ఐడియా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏడాదికి వంద కోట్లకు పైగా

ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు, హ్యాకింగ్‌ తదితరాలు ఏడాదికి వంద కోట్లకు పైగా జరుగుతున్నాయి. మోసాలకు గురైన వాళ్లలో అధిక భాగం ఫిర్యాదు చేయకుండానే మిన్నకుండిపోతున్నారు.

నష్టం రూ.32,400

సగటున ఒక్కో ఇంటర్నెట్‌ వినియోగదారుడి నష్టం రూ.32,400 గా ఉంది. సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో కనీసం ఒకరు 5,000 డాలర్లు నష్టపోయారు.

ఆర్థిక లావాదేవీలు

ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పిన వారి సంఖ్య 81 శాతంగా ఉంది.

ఆర్థిక సంబంధిత డేటా

ఆర్థిక సంబంధిత డేటాను అనుసంధానించే డివైస్‌ల్లో స్టోర్‌ చేసుకుంటామని చెప్పిన వారి సంఖ్య 44 శాతంగా ఉంది.

డివైస్‌లకు తగిన రక్షణ

ఈ డివైస్‌లకు తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పిన వారి సంఖ్య 60%గా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Over 50% victims of cybercrime struggle to recover their money: Kaspersky Labs read more at telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting