Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ లీక్‌.. గత మోడల్‌ కంటే అప్‌గ్రేడ్‌ ఫీచర్‌లతో లాంచ్‌..!

గూగుల్‌ పిక్సల్‌ 9a (Google Pixel 9a Smartphone) గురించి కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. పిక్సల్‌ 8a, పిక్సల్‌ 7a మోడళ్లు మే నెలల్లో విడుదల అయ్యాయి. అయితే పిక్సల్‌ 9a అంతకంటే ముందుగానే విడుదల అయ్యే అవకాశం ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా లాంచ్‌ వివరాలు లీక్ అయ్యాయి. దీంతోపాటు గత మోడళ్ల కంటే డిజైన్‌, పనితీరు పరంగా అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నెలలోనే లాంచ్! :
టిప్‌స్టర్ యోగేష్‌ బ్రార్‌ వివరాల ఆధారంగా గూగుల్‌ పిక్సల్‌ 9a ఫోన్‌ గ్లోబల్‌ లాంచ్ మార్చి 19 న జరగనుంది. అయితే భారత్ మార్కెట్‌లో మార్చి 20 న ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి రానుంది. అయితే గూగుల్‌ మాత్రం ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Google pixel 9a smartphone launch date

నాలుగు రంగుల్లో లభిస్తుంది! :
ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. డిజైన్ పరంగానూ కొన్ని మార్పులు రానున్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్ ఐరిస్‌, ఒబ్సిడియన్, పింగాణీ, పియోనీ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుందని సమాచారం.

గూగుల్‌ పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.28 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 2700 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు HDR10+ సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

గత మోడల్ కంటే అప్‌గ్రేడ్‌ ఫెర్ఫామెన్స్‌ :
ఈ గూగుల్‌ హ్యాండ్‌సెట్‌ అండర్‌ ది హుడ్‌ Tensor G4 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని సమాచారం. ఫలితంగా గత మోడల్‌ కంటే మెరుగైన పనితీరు అందిస్తుందని తెలుస్తోంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందే అవకాశం ఉంది. మరియు 5100mAh బ్యాటరీను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వైర్‌లెస్‌ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

కెమెరా మాడ్యూల్‌ డిజైన్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. గతంలో మోడళ్లు వెనుక వైపు కెమెరా బంప్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ పిక్సల్ 9a మోడల్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ధర వివరాలు లీక్‌ :
ఈ గూగుల్ పిక్సల్‌ 9a ధర వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.52999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే టాప్ ఎండ్‌ వేరియంట్ ధర రూ.62999 గా ఉంటుందని సమాచారం. విడుదల సమయంలో ధరలపై కచ్చితమైన వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 9a smartphone launch date leaked in india here are the expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X