Google పిక్సెల్ 9a ఫోన్ కొనాలా.. లేక డిస్కౌంట్‌లో ఉన్న పాత మోడల్ పిక్సెల్ 8a తీసుకోవాలా?
Pixel 9a vs Pixel 8a: గూగుల్ సంస్థ పిక్సెల్ 9a ని కొత్త హంగులతో, పెద్ద బ్యాటరీతో, అదిరిపోయే కెమెరాతో మార్కెట్లోకి వదిలింది. కానీ, పిక్సెల్ 8a ఇప్పుడు భారీ తగ్గింపు ధరలో దొరుకుతోంది. దీంతో చాలామందికి ఒకటే డౌటు. కొత్త మోడల్ కొనాలా? లేక తక్కువ ధరలో ఉన్న పాత మోడల్ తీసుకోవాలా? ఈ రెండిటినీ క్షుణ్ణంగా పోల్చి చూద్దాం పదండి.
* పెర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్..
పిక్సెల్ 9aలో కొత్త గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ ఉంది. ఇది AI ఫీచర్లను మరింత బాగా పనిచేసేలా చేస్తుంది, ఫోన్ వేగంగా రెస్పాండ్ అవుతుంది. పిక్సెల్ 8a లో మాత్రం పాత టెన్సర్ G3 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా పర్వాలేదు కానీ, కొత్త చిప్‌సెట్‌తో పోలిస్తే కొంచెం తక్కువే.

రెండిటిలోనూ 8GB RAM ఉంటుంది. కానీ పిక్సెల్ 9a మాత్రం 256GB స్టోరేజ్ వేరియంట్‌లోనే వస్తోంది. పిక్సెల్ 8a మాత్రం 128GB, 256GB ఆప్షన్స్‌లో దొరుకుతుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, పిక్సెల్ 9a సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15తో రిలీజ్ అవుతోంది. పిక్సెల్ 8a ఆండ్రాయిడ్ 14తో వస్తుంది.
రెండూ కూడా ఏడేళ్ల పాటు OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకుంటాయి. అంటే ఈ ఫోన్లకు చాలా కాలం వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. దానివల్ల ఎప్పుడూ కొత్త ఫోన్ వాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీలు ఏమొచ్చినా వాటిని ఈ ఫోన్లలో వాడుకోవచ్చు. మళ్లీ కొత్త ఫోన్ కొనాల్సిన పని ఉండదు.
* డిస్‌ప్లే, డిజైన్
పిక్సెల్ 9a కొంచెం పెద్దదైన 6.3-అంగుళాల యాక్చువా (Actua) OLED డిస్‌ప్లేతో వస్తోంది. పిక్సెల్ 8a మాత్రం 6.1-అంగుళాల స్క్రీన్‌తో ఉంది. రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉన్నాయి కాబట్టి స్క్రీన్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. అయితే పిక్సెల్ 9a ఫోన్ 2,700 నిట్స్ బ్రైట్‌నెస్ ఆఫర్ చేస్తోంది.
దీంతో ఎండలోనూ ఫోన్‌లో అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. పిక్సెల్ 8a మాత్రం 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ వరకే మద్దతిస్తుంది. డిస్‌ప్లే 0.2 అంగుళాలు పెద్దగా ఉన్నా పిక్సెల్ 9a అంత బరువుగా ఏమీ లేదు. పిక్సెల్ 9A కెమెరా బంప్‌ను తీసేసి, ఫోన్ వెనుక భాగంతో సమానంగా ఉండేలా కెమెరా భాగాన్ని డిజైన్ చేశారు.
ఇది దీనికి మరో ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం రెండిటిలోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంది. కానీ పిక్సెల్ 9a నీళ్లు, దుమ్ము నుంచి కాస్త ఎక్కువ ప్రొటెక్షన్ కోసం IP68 రేటింగ్‌తో వస్తోంది. పిక్సెల్ 8a కి IP67 రేటింగ్ ఉంది. అంటే కొంచెం తక్కువ ప్రొటెక్షన్.
* కెమెరా
రెండు ఫోన్లలోనూ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 13MP అల్ట్రావైడ్ లెన్స్ రెండిటిలోనూ కామన్. కానీ పిక్సెల్ 9a లో కొత్త 48MP మెయిన్ కెమెరా ఇచ్చారు. పిక్సెల్ 8a లో మాత్రం 64MP సెన్సార్ ఉంది. మెగాపిక్సెల్స్ తక్కువగా ఉన్నా, పిక్సెల్ 9a కెమెరా చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వస్తోంది.
తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే ఫొటోలు తీస్తుంది. ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయి. అంతేకాదు, దగ్గరగా క్లోజప్ షాట్స్ కోసం మాక్రో ఫోకస్ ఫీచర్ కూడా ఉంది. రెండు ఫోన్లలోనూ 4K వీడియో రికార్డింగ్, మ్యాజిక్ ఎడిటర్, AI-తో ఫొటోలను మరింత అందంగా మార్చే ఫీచర్లు ఉన్నాయి.
* బ్యాటరీ, ఛార్జింగ్
పిక్సెల్ 9aలో పెద్దదైన 5,100mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటల కంటే ఎక్కువసేపు వస్తుంది. పిక్సెల్ 8aలో 4,492mAh బ్యాటరీ ఉంది. ఇది దాదాపు 24 గంటల వరకు వస్తుంది. రెండూ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. కానీ బ్యాటరీ లైఫ్ విషయంలో పిక్సెల్ 9aనే ముందుంటుంది.
* గేమింగ్
టెన్సర్ ప్రాసెసర్లు గేమింగ్ కోసం అంత ఉత్తమమైనవి కాదు, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లతో పోలిస్తే వీటికి పవర్ తక్కువ. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే ఇది కరెక్ట్ ఛాయిస్ కాదు. కానీ ఫొటోలు, AI ఫీచర్ల విషయంలో మాత్రం ఈ ఫోన్లు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి.
* ఏది కొనాలి?
లేటెస్ట్ ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి కెమెరా కావాలంటే పిక్సెల్ 9a బెస్ట్ ఆప్షన్. ఇది మంచి పెర్ఫార్మెన్స్, చాలా ప్రకాశవంతమైన డిస్‌ప్లే ఆఫర్ చేస్తుంది. అంతేకాదు నీటిలో తడిచినా పాడైపోదు. నీటిలో తడవకుండా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, పిక్సెల్ 8a కూడా మంచి ఫోనే.
దాదాపు ఒకేలాంటి డిస్‌ప్లే క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్, చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ తక్కువ ధరకే దొరుకుతాయి. పిక్సెల్ 8a మీకు దాదాపు 37,999 రూపాయలకి దొరికితే, అది చాలా ఉత్తమమైన డీల్. కానీ కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టగలిగితే, పిక్సెల్ 9a 49,999 రూపాయలకు కొనడం బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
* పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e
పిక్సెల్ 9a, ఐఫోన్ 16e.. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనే సందేహం కూడా చాలామందిలో వ్యక్తం అవుతోంది. పిక్సెల్ 9a 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.49,999లే కానీ ఐఫోన్ 16e మాత్రం ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్లతో వస్తోంది. 128GB మోడల్ రూ.59,900, 256GB మోడల్ 69,900 రూపాయలు,
512GB మోడల్ రూ.89,900. ఐఫోన్ కాస్త ఎక్కువ ధర ఎక్కువైనా, మీకు కావాల్సినంత స్టోరేజ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, పిక్సెల్ 9aలో టెన్సర్ G4 చిప్‌సెట్, టైటాన్ M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్ ఉన్నాయి. ఇదే చిప్‌సెట్‌ను వాళ్లు టాప్ మోడల్ పిక్సెల్ 9 సిరీస్‌లో కూడా వాడారు.
జెమిని AI, గూగుల్ అసిస్టెంట్ లాంటి AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 16e లో A18 చిప్ ఉంటుంది. దీనిలో 6-కోర్ CPU, 4-కోర్ GPU ఇంకా 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. ఇది AI పనులను చాలా వేగంగా చేస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో జెన్‌మోజి, రైటింగ్ టూల్స్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
పిక్సెల్ 9a మంచి AI ఫీచర్లను అందిస్తున్నా, ఐఫోన్ 16e మాత్రం చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్లతో బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ అంత బడ్జెట్ లేకపోతే పిక్సెల్ ఎంచుకోవచ్చు. దసరా వంటి ఫెస్టివల్ ఆఫర్స్‌లో వీటిపై తగ్గింపులు, మంచి ఆఫర్లు వచ్చే అవకాశం కాబట్టి అప్పటిదాకా ఓపిక పట్టడం మంచిది.


Click it and Unblock the Notifications








