60 సెకన్లలో ఫిక్సల్ ఫోన్లు హ్యాకింగ్‌ : గూగుల్‌కి దిమ్మతిరిగింది

Written By:

గూగుల్‌కి దిమ్మతిరిగింది. కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫిక్సల్ ఫోన్లు కేవలం 60 సెకన్లలో హ్యాక్ చేయవచ్చని హ్యాకర్లు చెబుతున్నారు. అత్యంత పకడ్బందీ హార్డ్‌వేర్‌తో పాటు సాప్ట్‌వేర్‌ని పొందుపరిచిన గూగుల్ హ్యాకింగ్ విషయంపై ఇప్పుడు పునరాలోచనలో పడింది. సెక్యూరిటీపై దృష్టి పెట్టింది.

మోడీ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న ఈ కామర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాకర్లకు అనువుగా

సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్, ఫీచర్లు, హార్డ్వేర్ స్పెసిఫికేషన్లతో వచ్చిన గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ ఫోన్లు హ్యాకర్లకు అనువుగా ఉన్నాయి. సాక్షాత్తూ గూగుల్ సంస్థే దీన్ని నిర్దారించింది.

ప్లే స్టోర్ యాప్స్‌తో పాటు

గూగుల్ పిక్సల్ ఫోన్లలోని ప్లే స్టోర్ యాప్స్‌తో పాటు క్రోమ్ బ్రౌజర్, డివైస్లోని మెసేజెస్, కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలను రిమోట్గా యాక్సెస్ చేసుకునేందుకు వీలవుతుందట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూజర్ల ఫోన్లను తమ ఆధీనంలోకి

ఇది హ్యాకర్లకు ఎంతో అనువుగా ఉంటుందని, దీంతో వారు యూజర్ల ఫోన్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చని చైనీస్ హ్యాకర్ గ్రూప్ అయిన కిహూ 360 వెల్లడించింది.

పలు వివరాలను

ఇందుకు సంబంధించిన పలు వివరాలను ఆ గ్రూప్ గూగుల్‌కు తెలియజేసింది కూడా. అయితే గూగుల్ ఆ వివరాలను పరిశీలించి అవి నిజమేనని తాజాగా నిర్దారించింది.

1.20 లక్షల డాలర్ల క్యాష్ ప్రైజ్‌

ఈ క్రమంలో సదరు హ్యాకర్ గ్రూప్‌కు గూగుల్ 1.20 లక్షల డాలర్ల క్యాష్ ప్రైజ్‌ను కూడా అందజేసింది.

అప్‌డేట్ వెర్షన్ విడుదల

సదరు గ్రూప్ తమకు ఎంతో మేలు చేసిందని, అందుకే క్యాష్ ప్రైజ్ ఇచ్చామని, త్వరలో ఆ సాఫ్ట్‌వేర్ బగ్‌ను తొలగించి అప్‌డేట్ వెర్షన్ విడుదల చేస్తామని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel Phone Hacked in 60 Seconds at PwnFest 2016 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot