ఒక్క ఫోన్‌తో చైనా దిగ్గజాలను ఖంగుతినిపించింది

Written By:

చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పుడూ టాప్ లో ఉండే షియోమి, హువావే, జియోని, వన్‌ప్లస్ కంపెనీలకు ఒప్పో షాకిచ్చింది. చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త లీడర్‌గా అవతరించింది. తన ఆర్ సీరిస్ తో ఈ మధ్య రిలీజ్ చేసిన ఫోన్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అదే ఫోన్ భారత్‌లో ఎఫ్ 1 ప్లస్ గా రిలీజయింది. దీంతో చైనాలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

వాట్సప్ వీడియో కాల్‌ ఫీచర్‌ను పొందడం ఎలా..?( సింపుల్ ట్రిక్స్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాలో ఆర్ 9

చైనాలో ఆర్ 9 గా రిలీజయిన ఈ ఫోన్ సాధించిన అద్భుతమైన ఫలితాలతో ఒప్పో కంపెనీ క్యూ 3 లో చైనా స్మార్ట్ఫోన్ మార్కెట్లో తొలిసారిగా అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. దీంతో పాటు గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నాల్గవ స్థానంలో నిలిచింది.

గ్లోబల్ టాప్ -5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో

ఈ విషయాలను ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం .. ఒప్పొ కంపెనీ క్యూ 3 లో 2.53 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రరుుంచింది. గ్లోబల్ టాప్ -5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో మరే ఇతర కంపెనీ కూడా ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయలేకపోవడం గమనార్హం.

అమోలెడ్ డిస్‌ప్లే

ఇక కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో అదిరిపోయో లుక్ తో ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాసెసర్, ర్యామ్

2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, కలర్ ఓఎస్ 3.0, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2GHz ఆక్టాకోర్ మీడియా టెక్ MT6755 processor, ఎక్సాపాండబుల్ మెమొరీ 128 జిబి.

కెమెరా

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్

 

 

సెల్ఫీ ప్రియుల కోసం

ఇది ముఖ్యంగా సెల్ఫీ ప్రియుల కోసం దిగిన ఫోన్. చీకటి ప్రదేశంలో కూడా మీరు క్లియర్ గా సెల్ఫీ తీసుకునే సౌలభ్యం ఉంది. బ్యాక్ కెమెరా కన్నా ఫ్రంట్ కెమెరానే అదిరిపోయే విధంగా ఉంటుంది.

 

 

35 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్

ఫింగర్‌ప్రింట్ స్కానర్, 2850 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4జీ, 35 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పొందవచ్చు.

 

 

బరువు 145 గ్రాములు

ఇక దీని బరువు 145 గ్రాములు ఉంటుంది.హైబ్రిడ్ సిమ్ స్లాట్ విత్ నానో సిమ్ సపోర్ట్. WiFi, GPS, Bluetooth సపోర్ట్.

 

 

ధర

రూ.26,990 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo tops Chinese smartphone market in Q3 of 2016: IDC read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot