సగానికి పైగా తగ్గనున్న ఫోన్ల ధరలు, కొంచెం ఆగితే చాలు !

మంచి మొబైల్ కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఆవేశపడి ఇప్పుడే కొన‌కండి. కొంచెం ఓపిక చేసుకుని జూన్ చివ‌రి వ‌ర‌కు ఆగండి.

By Hazarath
|

మంచి మొబైల్ కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఆవేశపడి ఇప్పుడే కొన‌కండి. కొంచెం ఓపిక చేసుకుని జూన్ చివ‌రి వ‌ర‌కు ఆగండి. ఎందుకంటే జూన్ చివ‌రి వ‌ర‌కు ఫోన్ల ధ‌ర‌లు భారీగా త‌గ్గనున్న‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ప‌లు ఈ-కామ‌ర్స్ సైట్ల‌తోపాటు రిటెయిల్ మార్కెట్‌లోనూ వ్యాపారులు భారీ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లతో ఫోన్ల‌ను అమ్ముతున్నారు. అయితే ఆ ఆఫ‌ర్లు, రాయితీలు జూన్ చివ‌రి వ‌ర‌కు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిసింది.

 

జియో కథ కంచికి..? సర్వే చెప్పిన నిజాలు

జూలై 1 నుంచి మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు

జూలై 1 నుంచి మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు

జూలై 1 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ బిల్లును అమ‌లు చేయ‌నుంది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు పెరగ‌నున్నాయి.

ఫోన్ తయారీ ఖ‌ర్చు

ఫోన్ తయారీ ఖ‌ర్చు

కారణమేంటంటే వాటి విడి భాగాల‌పై ప‌న్నును పెంచ‌డ‌మే. దీంతో ఫోన్ తయారీ ఖ‌ర్చు పెరిగి త‌ద్వారా ఫోన్ల ధ‌ర‌లు కూడా పెరుగుతాయి.

పాత స్టాక్ ను క్లియ‌ర్ చేసుకునే ప‌నిలో ప‌

పాత స్టాక్ ను క్లియ‌ర్ చేసుకునే ప‌నిలో ప‌

ఈ క్ర‌మంలో పెరిగిన ధ‌ర‌లు అమ్మ‌కాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉన్నందున వ్యాపారులు త‌మ వ‌ద్ద ఉన్న పాత స్టాక్ ను ఇప్ప‌టికే క్లియ‌ర్ చేసుకునే ప‌నిలో ప‌డిన‌ట్టు తెలిసింది. అందుకనే వారు ఆఫ‌ర్లు, రాయితీల‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది.

గ‌త రెండు నెల‌లుగా
 

గ‌త రెండు నెల‌లుగా

గ‌త రెండు నెల‌లుగా ఫోన్ల షిప్‌మెంట్ల‌లో త‌గ్గుద‌ల క‌నిపించ‌డాన్ని బ‌ట్టి చూస్తే విక్ర‌య‌దారులు ఉన్న స్టాక్‌ను క్లియ‌ర్ చేసుకునే ప‌నిలో ప‌డిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతున్న‌ది. అందుక‌నే వారు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లను ప్ర‌క‌టిస్తున్నారు.

జూన్ చివ‌రి వారంలో

జూన్ చివ‌రి వారంలో

అయితే జూలై 1 నుంచి జీఎస్‌టీ అమ‌లులోకి రానున్నందున జూన్ చివ‌రి వారంలో వ్యాపారులు మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

ఆ ఒక్క వారంలోనే

ఆ ఒక్క వారంలోనే

దీంతో ఆ ఒక్క వారంలోనే పెద్ద ఎత్తున రాయితీల‌ను ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది. క‌నుక యూజ‌ర్లు అప్ప‌టి వ‌ర‌కు ఆగితే భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌తో ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు వీలుంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Best Mobiles in India

English summary
Flipkart, Reliance jio, jio, Redmi Note 4, xioami, vivo v5, moto m,nokia, Redmi 3s prime, whats hot, Bsnl, Irctc, Airtel, జియో, రిలయన్స్, ఐడియా , వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X