Home
Mobile

రూ.15000 కంటే తక్కువ ధరకే 64MP, 50MP సెల్ఫీ కెమెరాలు, 5000mAh బ్యాటరీ 5G ఫోన్‌..!

నోకియా ఫోన్‌ల తయారీ సంస్థ HMD సొంత బ్రాండ్ పేరుతో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఇటీవల కాలంలో ఫీచర్‌ ఫోన్లతోపాటు స్మార్ట్‌ఫోన్‌లనూ భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్‌ రేంజ్ ధరలోనే మెరుగైన ఫీచర్‌తో ఫోన్‌లను లాంచ్ చేసింది. గత సంవత్సరం జులైలో లాంచ్‌ అయిన HMD క్రెస్ట్‌ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

భారత్ మార్కెట్‌లో విడుదల సమయంలో హెచ్ఎండీ క్రెస్ట్‌ మ్యాక్స్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16499 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరియంట్‌ను రూ.14,989 ధరకు కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు EMI ట్రాన్సాక్షన్‌ పై గరిష్ఠంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

HMD crest max 5G Smartphone gets price drop on flipkart

హెచ్‌ఎండీ క్రెస్ట్‌ మ్యాక్స్‌ 5G స్మా్ర్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
HMD 5G స్మార్ట్‌ఫోన్ (HMD Crest Max 5G Smartphone) 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ OLED (2400*1080 పిక్సల్స్) డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ 6nm Unisoc T760 5G SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్‌ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని సంస్థ వెల్లడించింది.

HMD క్రెస్ట్‌ మ్యాక్స్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 64MP AI ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. నైట్‌ సెల్ఫీ, AI సూపర్‌ పొర్ట్రెయిట్‌, డిజిటల్‌ జూమ్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

ఈ హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ రిపేరబిలిటీ 1.0 ఫీచర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే, బ్యాక్ ప్యానల్‌, బ్యాటరీ, ఛార్జింగ్ పోర్ట్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ డీప్‌ పర్పుల్‌ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.

* ఈ సిరీస్‌లో బేస్ వేరియంట్ HMD క్రెస్ట్ 5G ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణ పొందుతుంది. Unisoc T760 5G SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OSను కలిగి ఉంది.

HMD క్రెస్ట్‌ 5G ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD crest max 5G Smartphone gets price drop on flipkart check full specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X