హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

Written By:

హువాయి బ్రాండ్ హానర్ నుంచి లేటెస్ట్ గా హానర్ 5Cస్మార్ట్ ఫోన్ రిలీజయిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ రెడిమీ నోట్ 3కి ధీటుగా మార్కెట్లోకి విడుదలయింది. మాస్ గా ఫోన్లను వాడే వినియోగదారులకు ఈ స్మార్ట్ ఫోన్ ఫర్ఫెక్ట్ గా సరిపోతుందని కంపెనీ చెబుతోంది. ఫోన్ విషయానికొస్తే అదిరిపోయే ఫీచర్స్ తో ప్రెండ్లీ బడ్జెట్ ధరలో ఈ మొబైల్ లభిస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ రూ. 10,999 ధరతో మార్కెట్లో లభిస్తోంది. ఫోన్ బాడీ మెటల్ కూడా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ ఎందుకు కొనాలనేదానిపై ఓ 5 అంశాలు మీ ముందుకు తెస్తున్నాం.

రెడ్మీ నోట్ 3కి Honor 5C షాకిచ్చిందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

ఇతర ఫోన్ల బాడీ మెటల్‌తో హానర్ 5జీ బాడీ మెటల్ ను పోల్చి చూస్తే హానర్ 5సీ బాడీ మెటల్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. మాస్అండ్ క్లాస్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్ బాడీని ఎయిర్ క్రాఫ్ట్‌గ్రేడ్ అల్యుమినియమ్ మిశ్రమంతో తీర్చిదిద్దారు. ప్రీమియమ్ లుక్‌తో వస్తోన్న ఈ ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. కూల్ ఛాసిస్, ఫోన్‌ను ఒక్క చేతితో హ్యాండిల్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. డిస్‌ప్లే రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x 1080 పిక్సల్స్, ట్రాన్స్‌లేట్ చేస్తే 424 పీపీఐ. ఈ డిస్‌ప్లేను గొప్ప విజువల్ ట్రీట్‌గా చెప్పుకోవచ్చు. మంచి రిసల్యూషన్, పిక్షర్ క్వాలిటీ, కలర్ రీప్రొడక్షన్, వ్యూవింగ్ యాంగిల్స్ వంటి అంశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

హానర్ 5సీ పోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వస్తోంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ బ్యాటరీ శక్తిని మాత్రమే ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని అందించటంతో బ్యాటరీ బ్యాకప్ మరింత రెట్టింపు అవుతుంది. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3, 4000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. అయితే, చెప్పుకోదగిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ అంశాలు ఈ బ్యాటరీలో లేవు.

హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటా మరింత సెక్యూర్‌గా ఉంటుంది. 156 గ్రాముల బరువుతో వస్తోన్న హానర్ 5సీ చేతిలో మరింత హ్యాండీగా ఉంటుంది.

హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్, పీడీఏఎఫ్, నైట్ మోడ్, గుడ్ ఫుడ్ మోడ్, బ్యూటీ మోడ్, లైట్ పెయింటింగ్ మోడ్ వంటి పీచర్లు ఫోన్ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి.

హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, యూఎస్బీ టైప్-సీ వంటి స్టాండర్డ్ కనెక్టుకవిటీ ఆప్షన్ లను హానర్ 5సీలో చూడొచ్చు. సరిగ్గా ఇలాంటి స్పెసిఫికేషన్సే రెడ్మీ నోట్ 3లో కూడా ఉన్నాయి.

హానర్ 5సీ గురించి 5 ఆసక్తికర విషయాలు

ఫోన్ కేక.. కెమెరా ఇంకా కేక..మరింత సమాాచారం కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write honor 5c 5 reasons why it is visual treat
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot