హెచ్‌టీసీ బటర్‌ఫ్లై x సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3!

Posted By: Staff

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై x సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3!

 

తన గ్లోబల్ వేరియంట్ ఫాబ్లెట్ ‘జే బటర్‌ఫ్లై’ను హెచ్‌టీసీ మంగళవారం తైపీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫాబ్లెట్‌కు సంబంధించి ఇప్పటికే చైనాలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. ధర $700 (రూ.37,500). యూకే ఆన్‌లైన్ రిటైలర్‌లు ప్రీఆర్డర్‌లను ఆహ్వానిస్తున్నప్పటికి ధర వివరాలను తమ లిస్టింగ్స్‌లో పేర్కొనలేదు. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే జే‌ బటర్‌ఫ్లై, గెలాక్సీ ఎస్3కి ధీటైన పోటినివ్వగలదని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండు గాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌‍ల పై తులనాత్మక అంచనా......

అదిరిపోయే ఫోన్‌లు.. రూ.3,000 ధరల్లో!

బరువు ఇంచా చుట్టుకొలత.....

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: చుట్టుకొలత 143 x 70.5 x 9.08మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాముల,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 136.6 x 70.6 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 133 గ్రాములు,

డిస్‌ప్లే......

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: హైడెఫినిషన్ 1080 పిక్సల్ 5 అంగుళాల ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్.......

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: 1.5గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఎక్పినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్,

ఆపరేటింగ్ సిస్టం......

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం (జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),

కెమెరా.......

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్........

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 32జీబి, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకనే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: వై-ఫై, బ్లూటూత్ వీ4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: వై-ఫై, బ్లూటూత్ వీ4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

ధర.......

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: ధర తెలియాల్సి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 16జీబి- రూ.34,900, 32జీబి - రూ.41,000.

ప్రత్యేకతలు.......

హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆప్ గ్రేడబుల్, ఎస్ ఫీచర్స్,

తీర్పు........

హై పిక్సల్ డెన్సిటీతో కూడిన పెద్ద డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్ ఇంకా మెరుగైన ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కోరుకునేవారికి హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై ఉత్తమ ఎంపిక. మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా సామ్‌సంగ్ అనుభూతులను కోరుకునే వారికి గెలాక్సీ ఎస్3 బెస్ట్ చాయిస్.

సామ్‌సంగ్‌‌తో సై అంటున్న హవాయి!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot