గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

Written By:

గూగుల్ నుంచి త్వరలో రానున్న గూగుల్ నెక్సస్ స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రస్తుతం హెచ్‌టీసీ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రొడక్ట్ ఫైనల్ వెర్సన్ ఆవిష్కరించిన తరువాత ఆ ప్రొడక్ట్ కమర్షియల్ గా గూగుల్ వెబ్ సైట్ లోకి రానుందని హెచ్‌టీసీ ప్రతినిధులు చెబుతున్నారు. రానున్న రెండు కొత్త నెక్సస్ స్మార్ట్‌ఫోన్లను ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్‌తో పనిచేసేలా తయారీచేస్తున్నామని హెచ్‌టీసీ రిపోర్టు చేసింది. ఈ ఫోన్ల కోడ్ నేమ్‌లను మార్లిన్, సెయిల్ ఫిష్‌గా పేర్కొంది. హెచ్‌టీసీ రిపోర్ట్ ప్రకారం గూగుల్ త్వరలోనే తన సొంత స్మార్ట్‌ఫోన్లను భారత్‌తో పాటు, ఇతర మార్కెట్లలో ఆవిష్కరించబోతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ల ఫీచర్లు కింది విధంగా ఉండే అవకాశం ఉంది.

కెమెరా ఫోటోల్లో రియల్ ఎమోషన్ కావాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్లిన్ ,సెయిల్ ఫిష్ డివైజ్

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

మార్లిన్ ఫోన్ అలాగే సెయిల్ ఫిష్ డివైజ్ ల ఫ్లాగ్ షిప్ 5.5 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే తో రానున్నాయి.

హెచ్‌టీసీ డిజైన్‌తో సమానమైన డిజైన్

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ విస్తరణ మెమరీ ఉండే అవకాశం .హెచ్‌టీసీ డిజైన్‌తో సమానమైన డిజైన్, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం

ఫింగర్‌ ప్రింట్ స్కానర్

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

ఫింగర్‌ ప్రింట్ స్కానర్ విత్ నెక్సస్ ఇంప్రింట్ సపోర్టు వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

సెయిల్ ఫిష్ డివైజ్ విషయానికొస్తే

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

సెయిల్ ఫిష్ డివైజ్ విషయానికొస్తే స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్, అలాగే 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది.

Image: Android Police (not a press render)

కెమెరా

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

జీఎఫ్‌ఎక్స్ బెంచ్ మార్క్స్ రిపోర్టు ప్రకారం ఈ డివైజ్‌కు 11 ఎంపీ వెనుక కెమెరా, 4 కే వీడియో రిపోర్టింగ్, 7 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుందని వెల్లడవుతోంది.

Image: Android Police (not a press render)

మరో రిపోర్టు మాత్రం

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

అయితే మరో రిపోర్టు మాత్రం సెయిల్‌ఫిష్‌కు 13 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ ముందు కెమెరా ఉంటుందని చెబుతోంది.

రింగ్ టోన్స్, నోటిఫికేషన్ సౌండ్లు

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

ఈ ఫోన్లలోని రింగ్ టోన్స్, నోటిఫికేషన్ సౌండ్లు తాజాగా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

అతి త్వరలో తెలిసే అవకాశం

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

ఈ డివైజ్‌ల వివరాలు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే వెలువడిన రిపోర్టుల ప్రకారం యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ వంటి టాప్ ఎండ్ సీరిస్‌ల మాదిరిగా గూగుల్ ఫోన్ కూడా మార్కెట్లను ఏలేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

సెప్టెంబర్-అక్టోబర్‌లో

గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

ఈ డివైస్ లు సెప్టెంబర్-అక్టోబర్‌లో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయని సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write HTC documents confirm new Nexus devices coming for Google
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot