తొలిసారిగా 10 కోర్‌ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ వన్ ఎ9

By Hazarath
|

తైవాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ వన్ ఎ 9 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను బెర్లిన్ ఐఎఫ్ఏ 2016 లో ప్రదర్శనకు ఉంచింది. త్వరలో ఈ ఫోన్ భారత మార్కెట్ కు రానుంది. అయితే దీనికి సంబంధించి ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఫీచర్లు మాత్రం ఇతర ఫోన్లకు ధీటుగానే వస్తున్నాయని సమాచారం. 10 కోర్ ప్రాసెసర్ తో రానున్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదేనని తెలుస్తోంది.ఇది ఆపిల్ ఐ ఫోన్6 మోడల్ ఎలా ఉందో అచ్చు గుద్దినట్లుగా అలాగే ఉంది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఒక సిమ్‌తో 10 ఫోన్లకు జియోని పొందడం ఎలా..?

#1

#1

5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మాలి టి 860 ఎంపీ 2 గ్రాఫిక్స్ తో ఈ ఫోన్ రానుంది.

#2

#2

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు మైక్రో ఎస్ డీ ద్వారా 2 టీబీ వరకు విస్తరించుకునే సామర్ధ్యం.

#3

#3

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో అదిరిపోయే ఫోటోలను షూట్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

#4

#4

ఫింగర్ప్రింట్ సెన్సార్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, 4 జీ ఎల్టీఈ లాంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

#5

#5

10 కోర్ మీడియా టెక్ హీలియో X20 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. క్లాక్ స్పీడ్ దాదాపు 1.96GHz ఉండే అవకాశం ఉంది. డెకా కోర్ ప్రాసెసర్ తో రానున్న మొట్టమొటది ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.

#6

#6

4 జిబి ర్యామ్ ఫోన్ కు ప్రాసెసర్ స్పీడ్ ఏ విధంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్సీడ్ తో Helio X20 processor ఫోన్లలో రన్ అవుతుందని ఇది హెచ్‌టీసీకి ప్రత్యేక ఆకర్షణ అని కంపెనీ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Here Write HTC One A9, First Smartphone to Feature 10-Core Processor Coming Soon; Release Date, Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X