ఒక జియో సిమ్‌ని 10 ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు

Written By:

అరచేతిలో ఇమిడే పోర్టబుల్ వైఫై హాట్‌స్పాట్ డివైజ్ 'జియోఫై'ని రిలయన్స్ జియో మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 2,899 రూపాయలు. దీనితో మీరు ఒక జియో సిమ్ ని ఉపయోగించి ఒకేసారి 10 డివైస్‌లకు నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా జియో 4 జి నెట్వర్క్ వేగాన్ని పొందవచ్చని కంపెనీ తెలిపింది.

రిలయన్స్ జియో vs బీఎస్ఎన్ఎల్:పోల్చి చూస్తే జియోకి షాక్

ఒక జియో సిమ్‌ని 10 ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు

మొబైల్లో జియో జాయిన్ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకుంటే జియోఫైని వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌ల కోసం కూడా వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ డిజిటల్ లేదా ఎక్స్ప్రెస్ మినీ స్టోర్లలో ఈ డివైజ్ అందుబాటులో ఉందని తెలిపింది. ఈ డివైజ్లో జియో సిమ్‌ను ఇన్సర్ట్ చేస్తే జియో 4 జి నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

డాల్బీ సౌండ్‌తో నూబియా జడ్11 ఫోన్

ఒక జియో సిమ్‌ని 10 ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు

దీనిలో 2300 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. ఎల్టిఇ బ్యాండ్ 2300, 1800, 850 మెగాహెట్జ్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది. 2.4 గిగాహెట్జ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. డేటా డౌన్లోడ్, స్టోరేజ్ కోసం 32 జిబిల వరకు మైక్రో ఎస్డి కార్డును కూడా ఇందులో ఇన్సర్ట్ చేయవచ్చు. 

షాక్..ఆ ఫోన్లపై ఏకంగా రూ. 10 వేలు తగ్గింపు

పోర్టబుల్ ద్వారా మీ పాత నంబర్‌తోనే జియో సిమ్ పొందడం ఎలాగో ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

పోర్ట్ 'అని టెక్ట్స్ మెసేజ్ టైప్ చేసి 1900 సర్వీస్ నెంబర్కు పంపాలి. ఈ సందేశం ద్వారా మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి సందేశం చేరుతుంది. 4 జీ హ్యాండ్సెట్ వినియోగదారులు మాత్రమే ఈ ప్రక్రియను అనుసరించాలి.

#2

మై జియో యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఆఫర్ కోడ్ను పొందుపరచండి. తరువాత దగ్గర్లోని రిలయన్స్ స్టోర్కు వెళ్లండి. పోర్ట్ అవుట్ కోడ్, ఫ్రీ వెల్కమ్ ఆఫర్ కోడ్, హ్యాండ్సెట్తో వెళ్లి రిలయన్స్ బ్రాంచిలో సంప్రదించండి.

#3

అడ్రస్ ఫ్రూఫ్, ఆధార్ ఫ్రూఫ్స్ జతచేసి రిలయన్స్ స్టోర్లో సమర్పించండి. ఇలా అందించిన వారం రోజుల లోపు సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతోంది. 19 రూపాయలు చార్జి అయినట్లు సందేశం వస్తుంది.

#4

మీరు అంతకుముందు వినియోగిస్తున్న సిమ్ నో సర్వీస్ మెసేజ్ చూపిస్తుంది. కొత్త సిమ్ కార్డ్ తీసుకున్న రీప్లేస్ చేయాలి.

#5

సిమ్ కార్డ్ వేసిన కొద్ది గంటల్లో నెట్వర్క్ వస్తుంది. రిలయన్స్ జియో కొత్త సిమ్ తీసుకున్న కస్టమర్లకు ఏ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయో, పోర్ట్ పెట్టుకున్న వారికి అవే ప్రయోజనాలు చేకూరుతాయి.

#6

మీరు వాడుతున్న సిమ్ కార్డ్ 90 రోజులకు పైబడితేనే ఈ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి. 90 రోజుల ముందు వారికి ఎటువంటి ప్రయోజనాలు వర్తించవు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write How to Setup and Connect to the Network with Reliance JioFi 4G Hotspot Device
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot