త్వరపడండి.. ఈ ఫోన్ రూ. 10 వేలు తగ్గింది

Written By:

HTC ఈ ఏడాది ఫిబ్రవరిలో HTC U Ultra, HTC U Playలను లాంచ్ చేసిన విషయం విదితమే. లాంచింగ్ సమయంలో HTC U Ultra ధరను రూ. 59,900గానూ HTC U Play ధరను రూ. 39, 900గాను నిర్ణయించింది. అయితే లాంచ్ చేసిన రెండు నెలలకే HTC U Play రూ. 10 వేలు తగ్గింది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ లభ్యమవుతోంది.

30 వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా ?

త్వరపడండి.. ఈ  ఫోన్ రూ. 10 వేలు తగ్గింది

Sapphire Blue and Brilliant Black ఈ రెండు కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. దీంతో పాటు క్రెడిట్ కార్డు మీద కొన్నవారికి 2,300 క్యాష్ బ్యాక్ ని కూడా అందిస్తోంది. అంతేకాకుండా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కవరేజిని అందిస్తోంది. ఫోన్ డ్యామేజి అయితే కవర్ ని కూడా ఫ్రీగా అందిస్తోంది.

ఐఫోన్ 8 ఆశలు ఆవిరి ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్.

ర్యామ్

ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి) 2టీబీ వరకు విస్తరణ సామర్థ్యం.

కెమెరా

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

బ్యాటరీ

2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్).

అన్ని యాప్‌లలో నిక్షిప్తమై ఉండే

హెచ్‌టీసీ తన యూ సిరీస్ ఫోన్‌ల ద్వారా 'Sense Companion' పేరుతో విప్లవాత్మక స్మార్ట్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఫోన్‌లోని అన్ని యాప్‌లలో నిక్షిప్తమై ఉండే ఈ ఫీచర్ వ్యక్తిగత అసిస్టెంట్‌లా వ్యవహరిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HTC U Play Price Slashed in India, Now Available on Amazon at Rs. 29,990 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot