ఐఫోన్ 8 ఆశలు ఆవిరి ..?

Written By:

ఐఫోన్‌ 8 ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూస్తున్న వారు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందేనా? అంటే.. అవుననే చెబుతున్నాయి మార్కెట్‌ వర్గాలు. తాజా పరిణామాలు చూస్తుంటే ఐఫోన్‌ 8 విడుదల ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఫోనంటే ఇదేరా బుజ్జీ.. సవాళ్లకే వణుకు పుట్టిస్తోంది !

ఐఫోన్ 8 ఆశలు ఆవిరి ..?

ఈ ఏడాదిలో ఐఫోన్ 8 రిలీజయ్యే అవకాశం లేదట. ఆపిల్ సంస్థ ఇటీవలి కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలే ఐఫోన్ 8 రిలీజ్‌కు అడ్డుపడుతున్నట్టు తెలిసింది.ఆపిల్ ఐఫోన్ల అమ్మకాలు గణనీయంగా తగ్గడం, దీనికి తోడు మార్కెట్‌లో యాపిల్ షేర్ విలువ 1 శాతానికి పడిపోవడం, ఇతర సంస్థలతో తలెత్తిన వివాదాలు వంటి కారణాల వల్ల ఆపిల్ తన ఐఫోన్ 8ను ఈ ఏడాది రిలీజ్ చేయకపోవచ్చని తెలిసింది.

ఈ చెత్త పాస్‌‌వర్డ్స్ పెట్టుకున్నారా..?

ఐఫోన్ 8 ఆశలు ఆవిరి ..?

ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుని వచ్చే ఏడాది ఆరంభంలో ఐఫోన్ 8కు ఆపిల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నట్టు సమాచారం. 2018 ఆరంభం వరకు వేచిచూడాల్సి రావొచ్చని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక పేర్కొంది. లేటయినా ఫీచర్స్ ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరికొత్త డిజైన్‌లో

సరికొత్త డిజైన్‌లో ఐఫోన్8 లాంచ్ చేస్తుందని, వాటిలో పొందుపరిచే ఫీచర్లు చాలామటుకు కొత్తగా ఉండబోతున్నాయని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
l

పిజికల్ హోమ్ బటన్ తీసివేసి వర్చ్యువల్ బటన్‌

తాజా రూమర్ ప్రకారం రానున్న ఐఫోన్లో పిజికల్ హోమ్ బటన్ తీసివేసి వర్చ్యువల్ బటన్‌ను ఆపిల్ తీసుకునరానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 8లో పూర్తిగా హోమ్ బటన్ తీసివేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తుందట.

5 అంగుళాల స్క్రీన్ తో

ఇప్పటిదాకా ఉన్న స్క్రీన్లకు రాంరాం చెప్పి 5 అంగుళాల స్క్రీన్ తో ఐఫోన్ 8 రానున్నట్లు సమాచారం. ఈ మధ్య రిలీజ్ చేసిన ఐఫోన్7 స్క్రీన్ 4.7 అంగుళాలు కాగ, పెద్ద వెర్షన్ ఐఫోన్7 ప్లస్ స్క్రీన్ 5.5 అంగుళాలు.

ఐఫోన్ 8 మూడు స్క్రీన్ సైజుల్లో

కొత్త రూమర్ల ప్రకారం ఐఫోన్ 8 మూడు స్క్రీన్ సైజుల్లో మార్కెట్లోకి అడుగు పెడుతుందట. అవి 4.7 అంగుళాలు, 5 అంగుళాలు, 5.5 అంగుళాలుగా ఉండబోతున్నాయని సమాచారం.
ml

రూమర్లను ఖండిస్తున్న ఇన్‌సైడర్లు

అయితే ఆపిల్ న్యూస్‌లను ఎప్పడికప్పుడూ అప్‌డేట్‌గా పేర్కొనే ఇన్‌సైడర్లు మాత్రం ఈ రూమర్లను ఖండిస్తున్నారు. ఎప్పుడూరెండు సైజుల ఫోన్లనే విడుదలచేసే ట్రెండ్‌ను ఆపిల్ అలానే ఫాలోఅవుతుందని పేర్కొంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
apple Will Not Release iPhone 8 This Year report read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot