హెచ్‌టీసీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ హెచ్‌టీసీ తన ప్రీమియమ్ క్వాలిటీ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘వన్ ఎం9 ప్లస్' తో పాటు మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను మంగళవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎం9 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.52,500. మే నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది.

హెచ్‌టీసీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎం9 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లను విశ్లేషించినట్లయితే....

5.2 అంగుళాల 2కే రిసల్యూషన్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), డ్యుయో కెమెరాలు, హెచ్‌టీసీ బూమ్ సౌండ్ విత్ డాల్బీ సరౌండ్ సౌండ్, మీడియాటెక్ హీలియో ఎక్స్10 కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, నాన్-రిమూవబుల్ 2840 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ.

హెచ్‌టీసీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఇదే వేదిక పై హెచ్‌టీసీ నుంచి విడుదలైన మరో ఫోన్ హెచ్‌టీసీ వన్ ఇ9+ ఫీచర్లను పరిశీలించినట్లయితే... ప్లాస్టిక్ బాడీ, 5.5 అంగుళాల తాకేతెర, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, నాన్-రిమూవబుల్ 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇదే వేదిక పై హెచ్‌టీసీ నుంచి విడుదలైన మరో ఫోన్ డిజైర్ 326జీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 32జీబి మెమరీ స్టోరేజ్.

ఇంకా చదవండి: మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

English summary
HTC unveils M9 Plus for Rs 52K; plans 4G phones under Rs 20K. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot