వెనుక వైపు రెండు కెమెరాలతో హానర్ 8: రిలీజ్ డేట్ ఫిక్సయింది

Written By:

హువాయి తన తరువాతి టెర్మినల్ బ్రాండ్ హానర్ 8 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు ముహుర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 12న న్యూఢిల్లీ ఈవెంట్‌గా ఈ ఫోన్‌ను హువాయి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలను కూడా కంపెనీ పంపించింది. దీనికి సంబంధించిన ధర, అలాగే అందుబాటులో ఉండే వివరాలను ఆవిష్కరణ కార్యక్రమంలోనే హువాయి ప్రకటించనుంది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ సేల్ : భారీ డిస్కౌంట్లు వీటిపైనే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 950 ప్రాసెస‌ర్‌ తో ఫోన్ రానుంది.మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్‌ అదనపు ఆకర్షణ,

ర్యామ్‌

4జీబీ ర్యామ్‌ తో పాటు 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలతో ఫోన్ రానుంది. వెనుకవైపు రెండు కెమెరాలు కలిగి ఉండటం ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో అదిరివిధంగా ఫోటోలు తీసుకోవచ్చు.

అదనపు ఫీచర్లు

పూర్తిగా ప్రీమియం మెటల్ డిజైన్, వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్, చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ అదనపు ఫీచర్లు.

బ్యాట‌రీ

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. దీని బరువు 153 గ్రాములు

మూడు వేరియంట్లలో

జూలైలో ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో చైనాలో కంపెనీ ఆవిష్కరించింది. 3జీబీ 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లతో ఈ ఫోన్ వచ్చింది.

ధర

3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ మోడల్ ధర 1,999 యువాన్స్(సుమారు..20వేలు), 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,299 యువాన్స్(సుమారు రూ.23వేలు), 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,499 యువాన్స్(సుమారు రూ.25వేలు)గా నిర్ణయించారు.

భారత మార్కెట్లోకి

అయితే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎన్ని వేరియంట్లలో ప్రవేశపెడుతుందో కంపెనీ వెల్లడించలేదు. ధర వివరాలను కూడా వెల్లడించలేదు. 12 వరకు వేచి చూడాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei Honor 8 launches in India October 12 read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot