6జిబి ర్యామ్‌తో టాప్ స్మార్ట్‌ఫోన్ దూసుకొస్తోంది

Written By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ దిగ్గజం హువాయి మార్కెట్లోకి తన తరువాతి తరం ఫోన్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఫోన్ కు సంబంధించి ఆన్ లైన్లో కొన్ని ఫోటోలు లీకయ్యాయి. లీకయిన ఫోటోల ప్రకారం రానున్న ఫోన్ పేరు మేట్ 9 గా తెలుస్తోంది. 6జిబి ర్యామ్ తో ఈ ఫోన్ దూసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హువాయ్‌ ఈ మేట్‌-9 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చేనెల 3న జర్మనీలో ఆవిష్కరించబోతున్నది.

వేగవంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 3టీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.9 అంగుళాల డిస్‌ప్లే

మేట్‌ 9 ఫీచర్ల విషయానికొస్తే 5.9 అంగుళాల డిస్‌ప్లే ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. 1920x1080 రిజల్యూషన్‌గా ఉంది.

6 జీబీ ర్యామ్‌

ర్యామ్ విషయానికొస్తే 4జీబీ లేదా 6 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ని పొందు పరిచినట్లుగా తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌

రానున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌ పై పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

20 మెగాపిక్సెల్‌ కెమెరా

కెమెరా విషయానికొస్తే 20 మెగాపిక్సెల్‌ కెమెరాను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సల్‌ ఉండే అవకాశం ఉంది.

ఫోన్‌ ధర

పర్పుల్‌ కలర్‌లో ఫోన్‌ డిజైన్‌ అట్రాక్టివ్‌గా ఉండి ఈ ఫోన్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.ఈ ఫోన్‌ ధర 480 నుంచి 705 డాలర్ల (సుమారు రూ. 32 వేల నుంచి రూ. 47వేల) మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు.

కలర్‌ వేరియంట్‌లో ఫోన్‌ రావడం ఇదే తొలిసారి

హువాయ్‌ నుంచి ఈ కలర్‌ వేరియంట్‌లో ఫోన్‌ రావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇందులో డుయెల్‌ కెమెరా సెటప్‌ కూడా ఉందని లీకైన ఫొటోలను బట్టి తెలుస్తోంది.

కంపెనీ మేట్‌-9 ప్రో

దీంతోపాటు ఈ కంపెనీ మేట్‌-9 ప్రో మోడల్‌ను కూడా విడుదల చేయబోతున్నది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei Mate 9 leaks in purple colour variant with Leica camera setup Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot