వేగవంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 3టీ..

Written By:

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన రాబోయే మొబైల్‌కి సంబంధించిన వివరాలను అనధికారికంగా వెల్లడించింది. ఆ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ డిజైనర్ ఒకరు కంపెనీ నుంచి త్వరలో ఓ ఫోన్ వస్తుందని దాని పేరు 'వన్‌ప్లస్ 3టీ' అని తెలిపారు.

రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు : గేమ్ స్టార్ట్ ఈ రోజే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌‌పై

రానున్న ఈ ‘వన్‌ప్లస్ 3టీ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌‌పై పనిచేస్తుందని వెల్లడించారు. అంతే కాకుండా దీనిలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ ఉంటుందని వెల్లడించారు.

కొత్త ప్రాసెసర్ పనితీరు

స్నాప్‌డ్రాగన్ 820తో పోలిస్తే కొత్త ప్రాసెసర్ పనితీరు 10 శాతం మెరుగ్గా ఉంటుందని ఇప్పటికే క్వాల్‌కామ్ వెల్లడించింది.

‘వన్‌ప్లస్ 3'లో కొంచెం మార్పులు

అయితే ‘వన్‌ప్లస్ 3'లో కొంచెం మార్పులు చేసి ‘వన్‌ప్లస్ 3టీ'ని తయారుచేసినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటికే చైనాలో ‘ఏ3010' పేరిట సర్టిఫై చేశారు. వన్‌ప్లస్ 3లో ఉన్నట్లే 3టీలో అమోలెడ్ డిస్‌ప్లే ‘డాష్ ఛార్జ్' ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తదితర ఫీచర్లున్నాయి.

గ్రాఫైట్ రంగులో

మరోవైపు ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999గా ఉంది. ఇది కేవలం గ్రాఫైట్ రంగులో మాత్రమే లభిస్తోంది.

ఫీచర్స్

దీనిలో 5.5 అంగుళాల ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే, 16ఎంపీ వెనుక కెమెరా, 8ఎంపీ ముందు కెమెరా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 3T coming soon with Snapdragon 821, Android 7.0 Nougat: Report Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting