తిరిగే కెమెరాతో ఐబాల్ స్మార్ట్‌ఫోన్

Posted By:

ప్రముఖ స్టైలిష్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్, 8 మెగా పిక్సల్ రొటేటింగ్ కెమెరా (తిరిగే కెమెరా) సదుపాయంతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అవోంటి 5 (Avonte 5) పేరుతో ఐబాల్ విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,999.

 తిరిగే కెమెరాతో ఐబాల్ స్మార్ట్‌ఫోన్

READ MORE: చైనా ఎందుకంత చవక..?

ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోని 21 ప్రాంతీయ భాషలను చదవటంతో పాటు వ్రాయగలదు. మరో రెండు వారాల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విక్రయించనున్నట్లు ఐబాల్ వెల్లడించింది. ఐబాల్ ఆండీ అవోంటి 5 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

 తిరిగే కెమెరాతో ఐబాల్ స్మార్ట్‌ఫోన్

READ MORE: ఆ 10 స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.5000 కంటే తక్కువే

5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 480x854పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రోటేటింగ్ కెమెరా. ఆటో ఫోకస్ ఇంకా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం.

 తిరిగే కెమెరాతో ఐబాల్ స్మార్ట్‌ఫోన్

READ MORE:  ఆండ్రాయిడ్ యూజర్లకు తెగ నచ్చేస్తున్న హానర్ 4సీ

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే... 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, ఎఫ్ఎమ్ రేడియో. 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్‌లో రోటేటింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరాను రొటేట్ చేయటం ద్వారా ప్రంట్, బ్యాక్ స్నాపర్‌లా ఉపయోగించుకోవచ్చు.

English summary
iBall Andi Avonte 5 with 8MP Rotatable Camera Launched at an Affordable Price. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot