Infinix Hot 8 Price Cut: RS.2000 తగ్గింపుతో ఇన్ఫినిక్స్ హాట్ 8 సేల్స్... త్వరపడండి
ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్ ను ఉపయోగించడం సర్వసాధారణం అయింది. వివిధ రకాల కంపెనీలు గొప్ప ఫీచర్లతో అనేక ధరలలో తమ స్మార్ట్‌ఫోన్ లను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇన్ఫినిక్స్ సంస్థ తక్కువ బడ్జెక్ట్ లో స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు దీని మీద సుమారు రూ.2000 లు తగ్గింపును పరిమిత కాలానికి అందిస్తున్నారు.

ఈ సంవత్సరం తక్కువ బడ్జెక్ట్ ఫోన్ లలో ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్ ఉత్తమంగా ఉంది. ఇది అతి పెద్ద భారీ డిస్ప్లే ను కలిగి ఉండి అలాగే 5,000 mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇన్ఫినిక్స్ సంస్థ ఇప్పుడు దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.6,999లకు విక్రయిస్తోంది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ పరిచయ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 8 యొక్క ఒరిజినల్ ధర 7,999 రూపాయలు. ఇప్పుడు ఈ ధర వద్ద 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌ను పొందవచ్చు.

ధర & ఆఫర్స్ వివరాలు
ఇన్ఫినిక్స్ హాట్ 8 4GB RAM + 64GB స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పుడు కేవలం రూ.6,999. దీనిని hdfc డెబిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసినచో 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు ఆక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ మీద 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వీటితో పాటు రూ.2000 విలువైన డిస్కౌంట్లు కూడా లబిస్తాయి.

స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్ 6.52-అంగుళాల డిస్ప్లేను 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో మరియు 20: 9 కారక నిష్పత్తి గల 2.5D గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది ప్యానెల్ HD + రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఇది డ్రాప్ నాచ్ డిస్ప్లే డిజైన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్. ఇందులో హెచ్‌డి సరౌండ్ సౌండ్ మద్దతును కలిగి ఉంటుంది. ఇది మెడిటెక్ హెలియో P22 SoC చేత రన్ అవుతుంది. క్వెట్జల్ సియాన్ మరియు కాస్మిక్ పర్పుల్ రెండు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ను కంపెనీ అందిస్తోంది.

కెమెరా
కెమెరాల విషయానికొస్తే ఇందులో AI- ఆధారిత ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరా సెటప్‌లో తక్కువ లైట్ సెన్సార్ కూడా ఉంది. ఈ సెటప్‌లో క్వాడ్ లీడ్ ఫ్లాష్ కూడా ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ ఒక సారి ఫుల్ ఛార్జ్ పై 25 రోజుల స్టాండ్బై సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇది 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో వస్తుంది. ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మద్దతును కలిగి ఉంటుంది. అలాగే వెనుక-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా XOS 5తో రన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








