Home
Mobile

12GB ర్యామ్, 50MP సోనీ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్‌.. AI ఫీచర్‌లు సహా..!

ఇన్ఫినిక్స్‌ నుంచి గ్లోబల్‌ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50 ప్రో ప్లస్‌ 5G (Infinix Note 50 pro+ 5G) పేరుతో విడుదల చేశారు. ఈ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే, మెటల్‌ ఫ్రేమ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతో లాంచ్‌ అయింది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50 ప్రో + 5G స్మా్ర్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆర్మర్‌ అల్లాయ్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

Infinix Note 50 pro Plus 5G smartphone

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్ట్రిమేట్‌ చిప్‌సెట్‌తో (అండర్‌ ది హుడ్‌) పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్‌ మరియు 256GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అదనంగా 12GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది.

Take a Poll

ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్ ఇన్ఫినిక్స్ AI ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. దీని ద్వారా Folax అసిస్టెంట్‌ను వినియోగించుకోవచ్చు. మరియు 1000 స్మార్ట్‌ ఫక్షనాలిటీస్‌ను పొందవచ్చు. రియల్‌ టైమ్ ట్రాన్సిలేషన్‌ వంటి అనేక సదుపాయాలను పొందవచ్చు.

ట్రిపుల్‌ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. (OIS) ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా మరియు 6X ఆప్టికల్‌ జూమ్‌, 100x డిజిటల్‌ జూమ్‌ సామర్థ్యంతో 50MP పెరిస్కోప్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 100W వైర్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్, 10W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీ తో పనిచేస్తోంది. ఛార్జింగ్‌ పరంగా ఈ ఫోన్ మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉందని తెలిపింది. మెరుగైన బ్యాటరీ ఫెర్ఫామెన్స్‌ కోసం Cheetah X2 చిప్‌ను అమర్చి ఉంటుంది.

IP64 రేటింగ్‌ :
ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. మెరుగైన ఆడియో కోసం JBL ఆధారిత డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు యాక్టివ్‌ హాలో AI లైటింగ్ ఫీచర్‌లున్నాయి.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50 ప్రో + 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ గ్లోబల్ మార్కెట్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర $370 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.31,000) గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ టైటానియం గ్రే, ఎన్‌చాంటెడ్‌ పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు స్పెషల్‌ రేసింగ్‌ ఎడిషన్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్ఫినిక్స్‌ విడుదల చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 50 pro Plus 5G smartphone launched with infinix AI and wireless charging in global market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X