స్టార్‌‌వార్స్ కంటెంట్‌తో వన్‌ప్లస్ 5టీ స్పెషల్ ఎడిషన్

|

స్టార్‌‌వార్స్ ఒక ఫ్రాంచైజీ మాత్రమే కాదు. ఇదో అద్భుతమైన కళాఖండం. అంతరిక్షంతో పాటు దాన్ని అల్లుకుని ఉన్న పాలపుంతల నేపథ్యంలో సాగిపోయే అడ్వెంచరస్ స్టార్‌వార్స్ కథలు గతకొన్ని తరాలుగా
యావత్ ప్రపంచాన్ని అలరిస్తూనే ఉన్నాయి. 1977లో ప్రారంభమైన స్టార్‌వార్స్ ప్రస్థానం 2017తో 40 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

 

అనిల్ అంబానీకి ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ముఖేష్ అంబాని !

స్టార్‌‌వార్స్ కంటెంట్‌తో వన్‌ప్లస్ 5టీ స్పెషల్ ఎడిషన్

స్టార్‌వార్స్ ఫ్రాంచైజీ నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన మూవీ ''స్టార్ వార్స్ : ది లాస్ట్ జేడీ’’. డిసెంబర్ 15న ఈ సినిమా భారత్‌లో విడుదలైంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వన్‌ప్లస్ ఇంకా డిస్నీ కంపెనీలు సంయుక్తంగా వన్‌ప్లస్ 5టీ స్టార్ వార్స్ పేరుతో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. డిసెంబర్ 14న ఈ ఫోన్ రిలీజ్ అయ్యింది. లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

మొబైల్ తయారీపై తక్కువ ఖర్చు పెట్టి కోట్ల లాభాలను కొల్లగొట్టిన చైనా కంపెనీలు !మొబైల్ తయారీపై తక్కువ ఖర్చు పెట్టి కోట్ల లాభాలను కొల్లగొట్టిన చైనా కంపెనీలు !

స్టార్ వార్స్ : ద లాస్ట్ జేడీ అఫీషియల్ ట్రైలర్

స్టార్ వార్స్ : ద లాస్ట్ జేడీ అఫీషియల్ ట్రైలర్

''స్టార్ వార్స్ : ది లాస్ట్ జేడీ'' మూవీకి సంబంధించిన అఫీషియట్ ట్రెయిలర్ పార్టును వన్‌ప్లస్ 5టీ స్టార్‌‌వార్స్ ఎడిషన్‌లో హైక్వాలిటీ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆస్వాదించవచ్చు.

4 రూపాయలకే మొబైల్ నంబర్ పోర్టబులిటీ, పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి !4 రూపాయలకే మొబైల్ నంబర్ పోర్టబులిటీ, పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి !

18:9 యాస్పెక్ట్ రేషియోతొ వస్తోన్న 6 అంగుళాల వన్‌ప్లస్ 5టీ స్ర్కీన్ 1080 పిక్సల్ క్వాలిటీలో సినీమాటిక్ విజువల్స్‌ను ఆఫర్ చేస్తుంది. స్టార్‌వార్స్ ఫ్యాన్స్‌కు వన్‌ప్లస్ 5టీ ఎడిషన్‌‌ను ఓ స్పెషల్ ట్రీట్‌గా చెప్పుకోవచ్చు.

 ఒక్క వీడియోలో స్టార్‌వార్స్ చరిత్ర
 

ఒక్క వీడియోలో స్టార్‌వార్స్ చరిత్ర

40 సంవత్సరాల స్టార్‌వార్స్ ప్రస్థానంలో అనేక కొత్త టెక్నాలజీలు ఆవిష్కరించబడ్డాయి. ముఖ్యంగా గెలాక్సీలకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఈ సినిమాల ద్వారా వెలుగులోకి తీసుకురావటం జరిగింది. ఈ వివరాలన్నింటిని ఒకేచోటుకు చేర్చి అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించి 30 నిమిషాలు అద్భుతమైన వీడియోను స్టార్‌వార్స్ బృందం అందుబాటులోకి తీసుకువచ్చింది.

డ్రైవింగ్ లైసెన్స్ మరచిపోయారా, పోలీసులకు ఈ యాప్ చూపిస్తే చాలు !డ్రైవింగ్ లైసెన్స్ మరచిపోయారా, పోలీసులకు ఈ యాప్ చూపిస్తే చాలు !

స్టార్‌వార్స్: క్లోన్‌వార్స్

స్టార్‌వార్స్: క్లోన్‌వార్స్

స్టార్స్‌వార్స్ ఫ్రాంచైజీ నుంచి 2008లో విడుదలైన క్లోన్ వార్స్ సిరీస్ అనేక విమర్శలను ఎదుర్కొంది. ఈ ఎపిసోడ్స్‌ను కొందరు మెచ్చుకుంటే మరికొందరు మాత్రం చెత్త టేకింగ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏదేమైనప్పటికి ఈ ఎపిసోడ్స్ ప్రస్తుతం వన్‌ప్లస్ 5టీ స్టార్‌‌వార్స్ ఎడిషన్‌‌లో అందుబాటులో ఉన్నాయి.

యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !

స్టార్‌వార్స్ : గెలాక్సీ ఆఫ్ హీరోస్

స్టార్‌వార్స్ : గెలాక్సీ ఆఫ్ హీరోస్

‘స్టార్ వార్స్ : గెలాక్సీ ఆఫ్ హీరోస్' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ గేమ్‌ను వన్‌ప్లస్ 5టీ స్టార్‌‌వార్స్ ఎడిషన్‌ అందిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్‌ను పొందవచ్చు. ఉత్కంఠభరితంగా సాగిపోయే ఈ గేమ్‌లో నక్షత్ర సముదాయల మధ్య జరిగే స్పేస్‌షిప్ పోరాటాలు ఆకట్టుకుంటాయి.

జియోలో ఈ కోడ్స్ గురించి మీకు తెలుసా..?జియోలో ఈ కోడ్స్ గురించి మీకు తెలుసా..?

డార్త్ వాడిర్స్ డెత్ - రిటర్న్ ఆఫ్ ద జేడీ

డార్త్ వాడిర్స్ డెత్ - రిటర్న్ ఆఫ్ ద జేడీ

స్టార్‌వార్స్ గెలాక్సీలకు సంబంధించిన ఐకానిక్ సన్నివేశాల్లో డార్త్ వాడిర్స్ డెత్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సీన్‌కు జాన్ విలియమ్ అందించిన పర్‌ఫెక్ట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గుండెల్ని పిండేస్తుంది. స్టార్ వార్స్ అభిమానులు ఈ సన్నివేశాన్ని ఎప్పటికి మరిచిపోలేరు.

లైట్‌సాబిర్ బ్యాటిల్స్

లైట్‌సాబిర్ బ్యాటిల్స్

స్టార్ వార్స్ ఎపిసోడ్స్ లోని అత్యుత్తమ సన్నివేశాల్లో లైట్‌సాబిర్ బ్యాటిల్స్ ఒకటి. ఈ ఉత్కంఠభరిత పోరాటాలను వన్ ప్లస్ 5టీ స్ర్కీన్ పై సినీమాటిక్ విజువల్స్ తో ఆస్వాదించవచ్చు. ఆన్‌లైన్ మార్కెట్‌కు వచ్చేసరికి అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ స్టోర్.ఇన్‌లు ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ విషయానికొస్తే నోయిడా, బెంగుళూరులోని వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Interesting Star Wars content you must watch on OnePlus 5T. Here's the list of must watch videos and games that as a Star Wars fan you must watch on your Limited Edition Star Wars OnePlus 5T

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X