సవాల్ విసరుతోన్న స్వదేశీ

Written By:

భారతదేశపు ప్రముఖ స్మార్ట్‌‍ఫోన్‌‌ల తయారీ కంపెనీ లావా తాజాగా ‘పిక్సల్ వీ1' పేరుతో తన సరికొత్త ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గూగుల్ అందించిన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లు ఈ హ్యాండ్‌సెట్‌కు మరింత క్రేజ్‌ను తీసుకువచ్చాయి.

Read More : సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికి పట్టుకోవటం ఏలా?

ఈ డివైస్ అందించే ఆండ్రాయిడ్ వన్ హై‌స్పీడ్ ఎక్స్‌పీరియన్స్ మరే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అందించలేదు. అత్యుత్తమ ఫీచర్లకు తోడు సాంప్రదాయ డిజైనింగ్‌ పిక్సల్ వీ1 స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా నిలబెట్టగలిగాయి. రూ.11,349కే లభ్యమవుతోన్న ఈ స్వదేశీ స్మార్ట్‌‍ఫోన్‌ను ఖచ్చితంగా సొంతం చేసుకోవాలనటానికి 9 ఆసక్తికర కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రీమియమ్ క్వాలిటీ డిజైనింగ్

లావా పిక్సల్ వీ1 సరికొత్త బ్రాండ్ డిజైనింగ్‌తో తొలి చూపులోనే ఆకట్టుకుంటుంది. ఫోన్ మందం 8.5 మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు. ఈ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ సౌకర్యవంతంగా చేతిలో ఇమిడిపోతుంది.

 

స్టన్నింగ్ డిస్‌ప్లే

లావా పిక్సల్ వీ1 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 5.5 అంగుళాల కాంతివంతమైన ఐపీఎస్ లామినేటెడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే అద్భుతమైన వీక్షణలను చేరువచేస్తుంది. ఫోన్ స్లిమ్ డిజైనింగ్ అదరహో అనిపిస్తుంది.

 

శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు

లావా పిక్సల్ వీ1 శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3 గిగాహెర్ట్జ్)ను కలిగి ఉంది. మాలీ - 400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్.

 

ఇంటర్నల్ స్టోరేజ్

లావా పిక్సల్ వీ1 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ ద్వారా ఫోన్ మెమరీని మరో 32జీబి వరకు పెంచుకోవచ్చు.

 

నాణ్యమైన ఫోటోగ్రఫీకి అనువుగా ప్రైమరీ కెమెరా

క్వాలిటీ ఫోటోగ్రఫీకి అనువైన 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఫీచర్‌ను లావా పిక్సల్ వీ1 స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. కెమెరా ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే 8 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 5 లేయర్ లార్గాన్ లెన్స్, తక్కువ వెళుతురులోని అత్యుత్తమ క్వాలిటీతో ఫోటోలను చిత్రీకరించుకునేందుకు ఎఫ్2.0 అపెర్చుర్, 1.4 మైక్రాన్ పిక్సల్ సైజ్, బ్లూ గ్లాస్ ఫిల్టర్

 

అత్యుత్తమ సెల్ఫీ షూటర్

సెల్ఫీలను అత్యుత్తమ క్వాలిటీతో చిత్రీకరించుకునేందుకు వీలుగా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను లావా పిక్సల్ వీ1లో ఏర్పాటు చేసారు.  8 మెగా పిక్సల్ రిసల్యూషన్, 1.4 మైక్రాన్ పిక్సల్ సైజ్, ఎఫ్2.4 అపెర్చర్, బ్లూ గ్లాస్ ఫిల్టర్చ, 4 లేయర్ లార్గాన్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

 

హైక్వాలిటీ ఆండ్రాయిడ్ వన్ ప్రదర్శన

లావా పిక్సల్ వీ1 ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు కొత్త సాప్ట్‌వేర్ అప్‌డేట్‌లతో హైక్వాలిటీ అనుభూతులను వినియోగదారులకు అందిస్తుంది. 

రెండు సంవత్సరాల వరకు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌లు

లావా పిక్సల్ వీ1 ఫోన్ లో పొందుపరిచిన ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్ రెండు సంవత్సరాల వరకు కొత్త ఓఎస్ అప్‌డేట్‌లను మీకందిస్తుంది.

 

సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్

లావా పిక్సల్ వీ1 ఫోన్‌లో ఏర్పాటు చేసిన 2560 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Introducing Lava Pixel V1: 9 Reasons Why Everyone Wants to Buy this Android One Smartphone. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot