భారత్‌లో ఐఫోన్ 16e సేల్ ప్రారంభం అయింది.. ధర, డిస్కౌంట్‌లు, ఫీచర్‌ల వివరాలు!
ఆపిల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూసిన ఐఫోన్ 16e హ్యాండ్‌సెట్ గత వారం భారత్‌లో లాంచ్ అయింది. ఈ ఐఫోన్ సేల్ (iPhone 16e sale in india) ప్రారంభం అయింది. ఐఫోన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ సహా అనేక సూపర్ ఫీచర్‌లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
స్టోరేజీ, కలర్ వేరియంట్స్ :
భారత్ మార్కెట్‌లో ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఆపిల్ ఐఫోన్ బ్లాక్, వైట్ వంటి రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ ధర, డిస్కౌంట్ వివరాలు :
ఐఫోన్ 16e 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59900, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69900, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89900 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు :
ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్ (Apple iPhone 16e) 60Hz రీఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 1170*2532 పిక్సల్స్ రిజల్యూషన్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ రక్షణను పొందుతుందని ఆపిల్ తెలిపింది. చిప్‌సెట్, OS పరంగా ఈ ఆపిల్ ఫోన్ 3nm A18 చిప్‌సెట్, iOS 18 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ కొత్త ఐఫోన్ యాక్షన్ బటన్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఒకే కెమెరాతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. (OIS) ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 48MP కెమెరాతోపాటు 12MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. బ్యాటరీ పరంగా USB-C 18W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మ్యాగ్‌సెఫ్ ఛార్జింగ్ సపోర్టు మాత్రం లేదు.
బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్! :
ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. అంటే 6 మీటర్ల నీటి లోతులో 30 నిమిషాల వరకు ఉన్నా.. ఫోన్ డ్యామేజీ కాదు. ఈ ఫోన్ ఫేస్ రికగ్నైషన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, Wi-Fi, GPS, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ (నానో + eSIM) ను సపోర్టు చేస్తుంది. అయితే కేవలం రెండు కలర్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








