ఐఫోన్7పై ఆపిల్ వార్నింగ్ : జాగ్రత్తగా ఉండాలని పిలుపు

By Hazarath
|

ఐ ఫోన్ 7, 7ప్లస్ లాంచ్ అయిన రెండో రోజే ఆపిల్ ముందస్తు వార్నింగ్‌లు జారీ చేసింది. ఈ మొబైల్స్‌తో చాలా జాగ్రత్తగా వాడాలని లేకుంటే అవి పనికిరాకుండా పోతాయని తెలిపింది. మెరిసే గాడ్జెట్లపై ఎక్కువ మమకారం పెంచుకున్న వారికోసం ఈ రకమైన కలర్లో ఐఫోన్ తీసుకువచ్చామని వీటి విషయంలో ఏ మాత్రం మీరు నెగ్లెట్ చేసినా గీతలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఐఫోన్ 7 విశ్వరూపం ఇదే !

#1

#1

ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్ ఫోన్లను లాంచ్ చేసిన ఒక్కరోజుకే ఆపిల్ ఐఫోన్ 7, ఐఫోన్7 ప్లస్ జెట్ బ్లాక్ వేరియంట్‌ను చాలా జాగ్రత్తగా వాడాలని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది.

#2

#2

ఈ వేరియంట్ త్వరగా గీతలు(స్క్రాచ్‌లు) పడే అవకాశాలున్నాయంటూ హెచ్చరించిన ఆపిల్, గీతలు పడకుండా ఉండేందుకు ఈ వేరియంట్‌కు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

#3

#3

కంపెనీ వెబ్‌సైట్‌లో కొత్త ఐఫోన్7 పేజీలో ఈ విషయాలను ఆపిల్ వెల్లడించింది. మెరిసే గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తిచూపే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఈ జెట్ బ్లాక్ ఐఫోన్7ను తీసుకొచ్చినట్టు తెలిపింది.

#4

#4

ఇతర ఆపిల్ అనాడిజైట్ ఉత్పత్తులతో లాగా దీని పైభాగం సమానంగా ఉన్నప్పటికీ, చాలా హార్డ్‌గా ఉంటుందని , తక్కువ రాపిడిలో వాడినప్పుడు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగొందుతుందని పేర్కొంది.

#5

#5

ఐఫోన్ జాగ్రత్తపరుచుకోవడానికి తాము ప్రతిపాదించే వాటిని ఈ ఫోన్‌కు వాడితే, ఐఫోన్7 జెట్ బ్లాక్ వేరియంట్‌ను గీతల బారినుంచి తప్పించవచ్చని వెల్లడించింది.

#6

#6

ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ కొత్త జెట్ బ్లాక్ వేరియంట్లు 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. కొత్త బ్లాక్ వేరియంట్ కేవలం 32జీబీ స్టోరేజ్ ఆప్షన్లోనే అందుబాటులో ఉండనుంది.

#7

#7

అయితే అక్టోబర్ 7 నుంచి భారత్?లో విక్రయాలు ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభ ధర ఇండియాలో రూ.60,000గా కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Here Write iPhone 7 Jet Black Variant Can Get Easily Scratched: Apple's Surprising Warning

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X