ఐఫోన్ 7 విశ్వరూపం ఇదే !

Written By:

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ప్రతిష్టాత్మక ఐఫోన్ -7 నేడు అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. కష్టమర్లు ఎంతో కాలం నుంచి ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆపిల్ ఐఫోన్ ఇప్పుడు మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఐఫోన్ 7 ప్రత్యేకతల పై స్పెషల్ ఫోకస్...

256జిబి స్టోరేజితో ఐ ఫోన్ 7, 7ప్లస్..రేపే విడుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

4.7 అంగుళాల, 5.5 అంగుళాల డిస్ ప్లేలతో ఐఫోన్ రెండు మోడళ్లను ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ పేర్లతో వినియోగదారుల ముందుకు ఆపిల్ తీసుకువచ్చింది. 

#2

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్ కంటే ఇవి చాలా స్లిమ్‌గా కస్టమర్లను అలరించబోతున్నాయి.

#3

గతంలో వచ్చిన ఐ ఫోన్లతో పోలిస్తే వీటిల్లో కెమెరా క్వాలిటీ పెరుగుతుంది. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో ఫోటోలను  రెండు వేర్వేరు ఎక్స్ పోజ్యూర్‌లో క్యాప్చర్ చేయవచ్చు. 

 

#4

కొత్త ఐఫోన్ 7 ప్లస్‌కు రెండు కెమెరాలు 12 ఎంపీ సెన్సార్సే. ఐఫోన్ 7 కు ఒకటే 12 మెగాపిక్సెల్ సెన్సార్. రెండు కొత్త కలర్స్‌లో ఆపిల్ ఈ సారి ఐఫోన్లను తీసుకువచ్చింది. అవి డీప్ బ్లూ, స్పేస్ బ్లాక్ వేరియంట్. 

#5

సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్తో యూజర్ ఎక్స్పీరియెన్స్ కొత్తగా ఉంటుంది. ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్ దీన్ని ప్రత్యేకత. ఫోన్లకు, ఇతర ప్రొడక్ట్‌లకు డేటా, పవర్ ట్రాన్సఫర్ చేసుకునే విధంగా స్మార్ట్ కనెక్టర్‌ను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. 

#6

32 జీబీ నుంచి 256 జీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యంతో, వేగవంతమైన ఏ 10 ప్రాసెసర్‌తో ఈ కొత్త మోడల్స్ వినియోగదారుల మందుకు వచ్చాయి. 

#7

సెప్టెంబర్ 16 నుంచి ఈ మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయని, ఒక వారం నుంచి ప్రీ-ఆర్డర్లను ఆపిల్ ప్రారంభిస్తుందని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి

#8

స్క్రీన్‌కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్‌ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని ఆపిల్ ప్లాన్ చేసింది. 

#9

వాటర్ రెసిస్టెంట్ డిజైన్, మెరుగైన స్టీరియో స్పీకర్స్, అత్యధిక బ్యాటరీ కెపాసిటీ, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్‌లు ఇవన్నీ కొత్త ఐఫోన్ 7 లో ఉన్నాయి.

#10

అంతర్జాతీయంగా ఆపిల్ -7 బేస్ మోడల్ (32 జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత్ లో దీని ధర సుమారు రూ. 63 వేలు ఉండే అవకాశముంది.

#11

అమెరికాలో ఈ నెల 15 నుంచి 19 వ తేదీ మధ్యలో ఐఫోన్ -7 అమ్మకాలు ప్రారంభమవుతాయని, భారత్ కు వచ్చేసరికి సెప్టెంబర్ 26 నుంచి ఐఫోన్ -7 మార్కెట్ లో లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write iPhone7 coming to India on Sept 26, prices may start from Rs 63,000
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting